BigTV English

Supritha Naidu: డ్రగ్ పెడ్లర్ ఆత్మహత్య.. టైగర్ అంటూ సురేఖవాణి కూతురు పోస్ట్ వైరల్

Supritha Naidu: డ్రగ్ పెడ్లర్ ఆత్మహత్య.. టైగర్ అంటూ సురేఖవాణి కూతురు పోస్ట్ వైరల్

Supritha Naidu: నటి సురేఖవాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. ఇక సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించే సురేఖవాణి బయట అందుకు రివర్స్ లో ఉంటుంది. మోడ్రన్ లుక్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి పబ్ లు, పార్టీలు అంటూ పొట్టిపొట్టి బట్టల్లో కనిపిస్తూ విమర్శలపాలు అవుతూ ఉంటారు. భర్త చనిపోయాకా.. సురేఖవాణి, కూతురుతో కలిసి ఇలా విచ్చలవిడిగా తిరుగుతుందని  నెటిజన్స్ విమర్శిస్తూ వస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోని ఈ తల్లీకూతుళ్లు తమ జీవితాన్ని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.


ఇక సుప్రీతను హీరోయిన్ చేయడం కోసం సురేఖ చాలా కష్టాలు పడుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ మెటీరియల్ అయినా.. అందాల ఆరబోతకు సై అంటున్నా సుప్రీతకు ఛాన్స్ లు మాత్రం అందడం లేదు. ప్రస్తుతం ఈ చిన్నది  ఒక యూట్యూబ్ ఛానెల్ లో టాక్ షోకు యాంకర్ గా చేస్తుంది. ఇంకోపక్క బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది.

ఇవన్నీ పక్కన పెడితే.. గతంలో ఈ తల్లికూతుళ్ళపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన విషయం కూడా విదితమే. ఈరోజు ఆత్మహత్య చేసుకున్న నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరితో  ఈ తల్లి కూతుళ్లు కలిసి ఉండడంతో  వీరు కూడా డ్రగ్స్ కేసులో కుమ్మకైఉన్నారని ఆరోపణలు వచ్చాయి. గోవాలో నైట్ క్లబ్ నడిపే కేపీచౌదరీని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు.. దాదాపు 18 మంది ప్రముఖుల పేర్లు లీక్ అయ్యాయి. అందులో  సురేఖ వాణి, సుప్రీత పేర్లు కూడా ఉన్నాయి.


Lavanya : 300 మంది అమ్మాయిల వీడియోలపై మస్తాన్ రియాక్షన్… నాపైనే వార్తలు వేస్తారా అంటూ బెదిరింపులు

సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సుప్రీతతో కేపీ చౌదరి దిగిన ఫొటోలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఆ తరువాత ఈ డ్రగ్స్ కేసుకు, తమకు ఎలాంటి సంబంధం లేదని సురేఖవాణి ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో మేము కూడా ఉన్నామని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. మాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు. దీనివలన  మా భవిష్యత్తు పాడవుతుంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి  అంటూ సురేఖ ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ వీడియో తరువాత సురేఖ, సుప్రీత సైలెంట్ అయ్యారు.

ఇక నేడు కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు.గతంలో డ్రగ్ పెడ్లర్ గా ఎంతో సంపాదించిన అతను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టమిట్టాడుతున్నాడు. ఆ ఆర్థిక ఇబ్బందులను తాళలేక నేడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు.  కేపీ చౌదరి మరణ వార్త విన్న సుప్రీత ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..” ఇక్కడ సమాజం విఫలమైంది. నువ్వు ఎప్పటికీ మిస్ అవుతావు అన్నా.. నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్నా. ఈ చెల్లి ఎల్లప్పుడూ మీ కోసం ఉంటుంది. దయచేసి నా దగ్గరకు తిరిగి రండి అన్నా. మిస్ యూ కెపీ అన్నా. నువ్వు ఎక్కడ ఉన్నా టైగర్ అంటావ్ గా.. ఐ లవ్ యూ అన్నా.. నీ ఆత్మకు శాంతి కలగాలి అన్నా”అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×