Manchu Mohan Babu : మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తి తగాదాలే ఈ గొడవలకు కారణమని ఇప్పటికే బయటపడింది. అయితే ఈ వివాదంతో తన ఆస్తులు తనకు అప్పగించాలని కోరుతూ మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంచు మనోజ్ కూడా ఇదే కార్యాలయానికి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా చెలరేగుతున్న వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంచు మనోజ్(Manchu Vishnu), మోహన్ బాబు ( Mohan Babu) వచ్చారు. ఆస్థి తగాదాల విషయమై వీరిద్దరు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తులను మంచు మనోజ్ అక్రమంగా ఆక్రమించాడని రంగారెడ్డి కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తాను సంపాదించిన ఆస్తులపై తనకు మాత్రమే హక్కు ఉంటుందని.. సొంత ఆస్తిపై ఎవరికి ఎలాంటి హక్కు లేదని… తన ఆస్తులు తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరినట్టు తెలుస్తోంది. తాను ఒక సీనియర్ సిటిజన్ అంటూ కలెక్టర్ కు తెలిపినట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తులు ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుందని.. కానీ మనోజ్ తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.
నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో వీద్దరిని పిలిచి రంగారెడ్డి సబ్ కలెక్టర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. డాక్యుమెంట్స్ తో సహా కలెక్టర్ ఆఫీసులోకి మంచు మనోజ్ ప్రవేశించిన నేపథ్యంలో మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ఆస్తుల్లో మనోజ్ పాగా వేశాడని.. తనకు న్యాయం చేయాలని మోహన్ బాబు కోరినట్టు సమాచారం. అయితే ఇప్పటికే మంచు మనోజ్ ను పిలిచి అధికారులు పలు విషయాలపై ప్రశ్నించగా.. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.
ఇక మంచి ఫ్యామిలీలో మనోజ్ కు రెండోసారి భూమా మౌనికతో పెళ్లి అయినప్పటి నుంచి వరుస వివాదాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ కుటుంబంలో వివాదాలు ముందు నుంచే ఉన్నప్పటికీ మనోజ్ వివాహంతో మరింత ఎక్కువయ్యాయి. ఆస్తులు విషయంలో సొంత అన్న, తండ్రి పైనే మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఆస్తుల విషయంలో ఇబ్బంది పెడుతున్నానంటూ ఫిర్యాదులు చేశాడు. బహిరంగంగానే తనకు అన్యాయం చేస్తున్నారని.. తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించాడు. తాజాగా తిరుపతి ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలోకి మనోజ్ ఎంటర్ అవ్వటానికి ప్రయత్నించగా సమస్య తీవ్రతరం అయ్యింది.
ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, మౌనిక.. నారా లోకేష్ ను సైతం కలిశారు. ఈ విషయం సైతం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాల నేపథ్యంలో మనోజ్, మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ALSO READ : 300 మంది అమ్మాయిల వీడియోలపై మస్తాన్ రియాక్షన్… నాపైనే వార్తలు వేస్తారా అంటూ బెదిరింపులు