BigTV English

Lavanya : 300 మంది అమ్మాయిల వీడియోలపై మస్తాన్ రియాక్షన్… నాపైనే వార్తలు వేస్తారా అంటూ బెదిరింపులు

Lavanya : 300 మంది అమ్మాయిల వీడియోలపై మస్తాన్ రియాక్షన్… నాపైనే వార్తలు వేస్తారా అంటూ బెదిరింపులు
Advertisement

Lavanya : యూట్యూబర్ మస్తాన్ సాయి (Masthan Sai) మరో వివాదంలో చిక్కుకున్నాడు. అతని దగ్గర నుంచి పోలీసులు 300 మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను గుర్తించారు. గతంలో రాజ్ తరుణ్ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ రోడ్డు ఎక్కిన లావణ్య (Lavanya) తాజాగా మస్తాన్ దురాగతాలను బయట పెట్టింది. చాలామంది అమ్మాయిల నగ్న వీడియోలను మస్తాన్ తీసినట్టు ఆమె వెల్లడించింది. ప్రేమా – పెళ్లి పేరుతో నమ్మించి, మరోవైపు డ్రగ్స్ కి బానిసైన అమ్మాయిల్ని లోబర్చుకున్నాడని, బెడ్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి , వాళ్ళందరితో ఉన్న వీడియోలు తీశాడని లావణ్య తన కంప్లయింట్ లఓ వెల్లడించింది. అంతేకాకుండా అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడిన వీడియోలను కూడా రికార్డ్ చేశాడనే సంచలన నిజాన్ని బయట పెట్టింది. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలన్నీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో భద్రపరిచినట్టు తెలుస్తోంది.


లావణ్యపై అత్యాచారం

అయితే గతంలోనూ లావణ్యపై అత్యాచారం చేసిన మస్తాన్ సాయి ఇలాగే వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. దీంతో లావణ్య తన వీడియోలు డిలీట్ చేయమని అడగగా, ఆమెపై అతను దాడి చేసినట్టు సమాచారం. దీంతో లావణ్య తన వీడియోల కోసం వెతుకుతుంటే హార్డ్ డిస్క్ లో వేరే అమ్మాయిల వీడియోలు భారీ సంఖ్యలో బయట పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ మస్తాన్ లావణ్య పై దాడి చేశాడు. ఆమె ఆ వీడియోలు ఇవ్వకపోవడంతో లావణ్యను చంపే ప్రయత్నం చేశాడు. దీంతో లావణ్య అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఆ 300 వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ని పోలీసులకి అప్పగించింది. తనతో పాటు వందల మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలంటూ ఆమె పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మీడియాకు బెదిరింపులు

ఈ నేపథ్యంలోనే మస్తాన్ దురాగతాలపై వరుసగా ప్రసారం చేస్తున్న కథనాలపై మస్తాన్ సాయి రియాక్ట్ అయ్యాడు. ఏకంగా బిగ్ టీవీకి కాల్ చేసి, తన మాటలను ప్రసారం చేయొద్దు, రాయొద్దు అంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలు ఒప్పుకుంటేనే వీడియోలు తీసానని, మ్యూచువల్ ఇంట్రెస్ట్ తోనే వీడియోలు టెలికాస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆ వీడియోలతోనే లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని మస్తాన్ సాయి చెప్పుకొచ్చాడు.

మస్తాన్ దగ్గర నిఖిల్ ప్రైవేట్ వీడియోలు

మస్తాన్ సాయి గతంలో పలుమార్లు డ్రగ్స్ కేసులో పట్టు బడ్డాడు. అంతేకాకుండా అతనిపై ఇప్పటికే పలు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బయట పడ్డ ఆ 300ల ప్రైవేట్ వీడియోల హార్డ్ డిస్క్ సంచలనంగా మారింది. అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు హీరో నిఖిల్ (Nikhil) ప్రైవేట్ పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు మస్తాన్ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. అలాగే వరలక్ష్మీ టిఫిన్స్ ఓనర్  ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వీడియోలను కూడా మస్తాన్ సేవ్ చేసి పెట్టాడని సమాచారం. మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×