E-Paper
Advertisement

SURIYA: ‘కంగువ’లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన హీరో సూర్య..

SURIYA: ‘కంగువ’లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన హీరో సూర్య..
Advertisement

SURIYA: విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఓ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో కోలీవుడ్ నటుడు సూర్య ఒకరు. ఈ హీరోకు కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు సైతం థియేటర్ల వద్ద బారులు తీరుతారు. అయితే ఇప్పుడు సూర్య ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘కంగువ’.

ఈ ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం పై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రంలో సూర్య పవర్ ఫుల్ యోధుడి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూర్య ఓ అప్డేట్ అందించారు.

Advertisement

ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది అని తెలిపారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తనకు ఎంతో సహకరించారని.. ఎన్నో జ్ఞాపకాలు ఈ జర్నీలో ఉన్నాయి అని అన్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ శివకి, చిత్ర యూనిట్‌కి థాంక్స్ చెప్పారు. వీటితో పాటుగా ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. UV క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ భారీ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×