BigTV English
Advertisement

Kanguva: దేవర డేట్ ను లాగేసుకున్న కంగువ.. శవాల గుట్టపై సూర్య భీకర రూపం

Kanguva: దేవర డేట్ ను లాగేసుకున్న కంగువ.. శవాల గుట్టపై సూర్య భీకర రూపం

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియోస్, kvn ప్రొడక్షన్స్ బ్యానర్స్ తో నిర్మిస్తున్నాయి. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నది. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్.. కంగువ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 10 న కంగువ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.

ఇక ఈ డేట్ చూడగానే ఏదో సినిమా గుర్తొస్తుంది కదా.. అవును, మీరు ఉహించింది నిజమే. ఈ డేట్ నే మొదట ఎన్టీఆర్ దేవర రిలీజ్ కు అనుకున్నారు. కానీ, సెప్టెంబర్ 27 న పవన్ og వాయిదా పడడంతో ఆ డేట్ ను దేవర తీసుకున్నాడు. ఇక దేవర డేట్ కోసం టాలీవుడ్ లో చిన్న సినిమాలు బాగానే ఫైట్ చేసాయి. కొన్ని సినిమాలు ఆ డేట్ ను లాక్ కూడా చేశాయి.


ఇక ఇప్పుడు సూర్య కూడా అదే రోజున రాబోతున్నాడు. దేవర డేట్ ను తాను కూడా పట్టేశాడు. ఆరోజు స్టార్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో సూర్యకు ఇది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సూర్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ కూడా సూర్య సినిమాల కోసం అభిమానులు ఎదుచూస్తున్నారు. దీంతో ఈ డేట్ మంచిదే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

కంగువ లో సూర్య డబుల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. ఇక రిలీజ్ పోస్టర్ లో సూర్య లుక్ ఎంతో భీకరంగా ఉంది. శవాల గుట్టపై నిలబడి.. తన వీర గర్వం చూపిస్తూ కత్తిని పైకి ఎత్తి విజయాన్ని ప్రకటిస్తున్నట్లు కనిపించాడు. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×