E-Paper
Advertisement

Suriya – Kanguva Movie: క్రేజీ అప్డేట్.. ‘కంగువ’లో సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తాడా..?

Suriya – Kanguva Movie: క్రేజీ అప్డేట్.. ‘కంగువ’లో సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తాడా..?
Advertisement

Suriya – Kanguva Movie Update: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో అతడికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. టపాసులు కాలుస్తూ డప్పు చప్పుల్లతో అభిమానులు సందడి చేస్తారు. మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ సూర్య బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు.

గతంలో ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో వచ్చి కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నాడు. ఇలా వరుస డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వచ్చి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సూర్య నటిస్తున్న కొత్త సినిమా ‘కంగువ’. అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశాయి.

Advertisement

Also Read: దేవర డేట్ ను లాగేసుకున్న కంగువ.. శవాల గుట్టపై సూర్య భీకర రూపం

అంతేకాకుండా పోస్టర్లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల ఈ సిిమాలో సూర్యకి సంబంధించి రెండు లుక్‌లను మేకర్స్ రివీల్ చేశారు. అందులో ఒక లుక్ కత్తి పట్టిన యుద్ద వీరుడిలా కనిపించాడు. మరొక లుక్‌లో మోడరన్ వారియర్‌గా ఎదురెదురుగా కనిపించి ఆసక్తి పెంచేశారు. అదే సమయంలో ఈ మూవీ గతం, వార్తమానం, భవిష్యత్‌తో స్టార్ట్ అవుతుందని ఓ క్యాప్షన్‌తో చెప్పకనే చెప్పారు. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

అలాగే దిశా పటానీ కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తుంది. వీరితో పాటు జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, యోగిబాబు వంటి నటులు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక చారిత్రాత్మక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో కాకుండా మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు డిఫరెంట్ పాత్రల కోసం సూర్య ఏకంగా తన లుక్‌ని మార్చుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే మూడు పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×