E-Paper
Advertisement

Swag Twitter Review : శ్రీవిష్ణు ‘స్వాగ్’ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ కొట్టినట్లేనా?

Swag Twitter Review : శ్రీవిష్ణు ‘స్వాగ్’ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ కొట్టినట్లేనా?
Advertisement

Swag Twitter Review :టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా చేస్తూ వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి సపోర్టింగ్ రోల్స్ తో అలరించిన ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన అకౌంట్ లో వేసుకుంటున్నాడు. ఇప్పుడు వైవిధ్యమైన కథతో స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో వచ్చేసింది. విడుదలకు ముందు మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ పై జనాల రెస్పాన్స్ ఎలా ఉందో ట్వీట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఈ సినిమా టాక్ ఏంటో ఒకసారి చూసేద్దామా..

శ్రీ విష్ణు, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, యువ హీరోయిన్ దక్షా నగార్కర్, శరణ్య నటించిన చిత్రం స్వాగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మూవీకి డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఏంటో ఒకసారి చూసేద్దాం..

Advertisement

స్వాగ్ ఫస్టాఫ్ ఒకేలా ఉంది. సెకండాఫ్ ఎటో వెళ్లిపోతుంది. కానీ దర్శకుడు హసిత్ గోలిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన నిరాశ పరచరనే అభిప్రాయం నాకు ఉంది.. సినిమా అంతా నవ్వులు పూస్తుంది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

 

Advertisement

ఫస్ట్ హాఫ్ పూర్తయింది… ఎంత నవ్వించే రైడ్. తెలుగు సినిమాల్లో ‘శ్రీ విష్ణు’ అనే ప్రత్యేకమైన జానర్ ఉంది, ఈ సినిమా ఎలా తెరకెక్కుతుందో నాకు చాలా ఇష్టం.

 

శ్రీవిష్ణు తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను అందించాడు. వినోదానికి భవభూతిగా, సందేశానికి విబూధిగా ప్రకాశిస్తాడు.. ఈ సినిమా వన్ మ్యాన్ షో అయ్యింది. ఇలాంటి సరికొత్త పాత్రలు చెయ్యాలంటే అది శ్రీ విష్ణు మాత్రమే చేస్తాడు.. సినిమా కిల్లింగ్ అంతే అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

 

శ్రీ విష్ణు రాజ రాజ చోర తర్వాత నా ఫేవరేట్ కాంబో ఇది. ఈ సినిమా చూస్తే సీరియస్ కంటెంట్‌తో మంచి పాయింట్ ఉందనిపిస్తుంది. ఒకవేళ ఆ పాయింట్‌ను 2.30 గంటల్లో చెప్పగలిగితే మాత్రం వారి సక్సెస్‌ను ఎవరు కూడా ఆపలేరు.. మొత్తానికి సూపర్ హిట్ అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇలా నెటిజన్లు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ట్విట్టర్ ద్వారా అందుతున్న టాక్ చూస్తుంటే సినిమా హిట్ టాక్ ను అందుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఎలా టాక్ ను సొంతం చేసుకుంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×