BigTV English

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్‌గా నబీల్ ..ప్రేరణ యష్మీ మధ్య ఫైట్.. అదే ట్విస్ట్..

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్‌గా నబీల్ ..ప్రేరణ యష్మీ మధ్య ఫైట్.. అదే ట్విస్ట్..

Bigg Boss 8 Telugu :బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం కాస్త కష్టమే అని చెప్పాలి . ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. నిన్న రాత్రి ఎపిసోడ్ లో ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక హౌస్‌కి వైల్జ్ కార్డ్ ఎంట్రీలు వచ్చే ముందు పెద్ద ట్విస్ట్‌‌యే ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటివరకూ రేషన్ గురించి, టాస్కుల గురించి ఉన్న కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా చేసి హింసించి బిగ్‌బాస్ ఇక ఒకటే క్లాన్ అంటూ ప్రకటించాడు. పైగా ఇక మెగా చీఫ్ అంటూ ఒకరే ఉంటారంటూ చెప్పాడు.. ఈ క్రమంలో పృథ్వి పై నబీల్ విజయం సాధించి మెగా చీఫ్ అయ్యాడు. నబీల్ చీఫ్ అవ్వడం యష్మీ ఓర్వలేక పోయింది..


నబీల్ తప్పు చేసిన ప్రేరణ సపోర్ట్ చేసింది. ఫ్రెండ్ అయ్యింది. లేకుంటే వేరేలా ఉండేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్, నిఖిల్, ప్రేరణ పప్పీ టాస్కు ఆడారు. చివరిగా నిఖిల్ పేరున్న పప్పీతో ప్రేరణ వచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరు ఉండాలి లేదు అనేది ఆదిత్య డిసైడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రేరణ మరోసారి తన పాయింట్స్ చెప్పుకుంది. నాలో కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయని మీరు చెప్పారు.. అలానే కొన్ని పాజిటివ్స్ కూడా చెప్పారు.. నిఖిల్ చీఫ్ గా చాలా సార్లు ఉన్నాడు. నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని ప్రేరణ తన అభిప్రాయం చెప్పింది. ఇక చివరగా నబీల్ గెలిచాడు.. ఇంట్లో ఉన్న అందరు నబీల్ బెస్ట్ అని ఎంపిక చేశారు.

హౌస్ లో చివరగా నబీల్, పృథ్వి లకు మెగా చీఫ్ అనే టాస్క్ ను ఇచ్చాడు. Iam mega chief అనేది ఫాం లో పెట్టాలి. ఈ టాస్క్ లో పృథ్వి ఓడిపోయాడు. పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణు కంటే యష్మీనే ఎక్కువ ఫీల్ అయిపోయింది. అసలు పృథ్వీ ఎమోషనల్ అయినా కంట్లో నుంచి నీళ్లు మాత్రం రానివ్వలేదు. కానీ యష్మీ మాత్రం కుళాయి తిప్పేసింది. అయితే పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణమంటూ యష్మీ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. ఏదో బాయ్ ఫ్రెండ్ ను చేసినట్లు ఏడుస్తూ ప్రేరణను తిట్టింది. ప్రేరణ వల్లే పృథ్వి ఓడిపోయాడు ఫ్రెండ్ కాబట్టి బ్రతికి పోయింది. వేరే అయ్యి ఉంటే మరోలా ఉండేది అంటూ చాలా ఫీల్ అయ్యింది. ఈ దెబ్బతో ప్రేరణ, యష్మీ మధ్య దూరం పెరిగింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ తో హౌస్ కు మెగా చీఫ్ అయ్యాడు నబీల్.. అలాగే మిడ్ వీక్ లో ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.


Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×