BigTV English

Swayambhu: కత్తి పట్టి కసితో చూస్తున్న నిఖిల్.. పోస్టర్ అదిరింది

Swayambhu: కత్తి పట్టి కసితో చూస్తున్న నిఖిల్.. పోస్టర్ అదిరింది

Swayambhu: కార్తికేయ 2 తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు కుర్ర హీరో నిఖిల్. ఈ సినిమా తరువాత స్పై సినిమాతో వచ్చాడు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక ఈసారి మాత్రం అలా కాకుండదని ఏరికోరి మంచి కథలను ఎంచుకున్నాడు. అందులో ఒకటి స్వయంభు.


ప్రస్తుతం ఇండస్ట్రీలో పీరియాడిక్ సినిమాలు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో నిఖిల్ సైతం ఆ జోనర్ ను సెట్ చేసుకున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రంలో నిఖిల్ సరసన సంయుక్తా మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే యుద్ధ విద్యలు అన్ని నేర్చుకున్నాడు. కత్తి సాము, గుర్రపు స్వారీ తో పాటు బాడీని కూడా బాగా పెంచాడు. ఇక నేడు నిఖిల్ పుట్టినరోజు కావడంతో మేకర్స్.. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ నిఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టర్ లో నిఖిల్ యోధుడిగా కనిపించాడు.


రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని యుద్ధ భూమిలో కసిగా శత్రువులను వేటాడుతున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు బాహుబలి తరహాలో ఉందని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×