BigTV English

Jogi Ramesh: చంద్రబాబు పర్యటనపై జోగి రమేష్ కామెంట్స్.. దాచుకోవడానికేనా అంటూ..

Jogi Ramesh: చంద్రబాబు పర్యటనపై జోగి రమేష్ కామెంట్స్.. దాచుకోవడానికేనా అంటూ..

Jogi Ramesh Fires On Chandrababu Tour(Political news in AP): చంద్రబాబు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏం ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన గురించి ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పడం లేదని తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అన్నారు.


చంద్రబాబు మొదట హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారో తెలియదన్నారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారని కొందరు చెబుతుండగా.. సొంత పార్టీ నేతలే అమెరికా వెళ్లలేదని చెబుతున్నారని అన్నారు. ఇంతకీ చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు ?ఎందుకు వెళ్లారు? అన్న విషయాలు తెలియడం లేదన్నారు. చంద్రబాబు పర్యటన వెనక కారణం ఏమిటి అని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బు దాచుకోవడానికేనా అని విమర్శించారు. విదేశాలలో పెట్టబుడులు పెట్టడానికి వెళ్లారా లేక ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని మంత్రి అన్నారు.

Also Read: పల్నాడు రౌడీలకు లేడీ సింగం మాస్ వార్నింగ్..


సీబీ వెంకటేశ్వరరావు టీడీపీ తొత్తు కాదా అని ప్రశ్నించారు. వివిధ పరికరాల కొనుగోలు స్కాంలో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా ఏబీవీ పాత్ర ఉందని నిర్ధారించిందన్నారు. సీబీ వెంకటేశ్వర రావు చరిత్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. నిన్నటితో ఆయన నిజ స్వరూపం బయటపడిందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ తో కూటమి దిమ్మతిరిగి పోతుందన్నారు. వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని తెలిపారు . వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్దంగా ఉండాలన్నారు.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×