Big Stories

Tamanna bhatia : వాళ్లు అస‌లు ఇష్ట‌ప‌డ‌రంటూ…. స్టార్ హీరోల గుట్టు బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా!

Tamanna bhatia : స్టార్ హీరోల గురించి ఎవ‌రేం చెప్పినా ఆస‌క్తిక‌రంగా వినాల‌నిపిస్తుంది. అందులోనూ వారితో రోజుల త‌ర‌బ‌డి సినిమాలు చేసే హీరోయిన్లు చెబితే ఇంకా ఉత్సాహం డ‌బుల్ అవుతుంది. రీసెంట్‌గా అలాంటి విష‌యాల‌నే ముంబై మీడియాతో షేర్ చేసుకున్నారు త‌మ‌న్నా. సినిమాల్లో ఇంటిమేట్ సీన్ల గురించి బోల్డ్ గా మాట్లాడారు త‌మ‌న్నా. మామూలుగా సినిమాల్లో స‌న్నివేశాలు చేయ‌డం తేలికే. అదే హీరో, హీరోయిన్లు స‌న్నిహితంగా ఉండే సీన్లు చేయాలంటే ఎలా చేస్తారు? ఆ స‌న్నివేశాల్లో న‌టించేట‌ప్పుడు హీరోలు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? హీరోయిన్లు కంఫ‌ర్ట్ గా ఉంటారా? అసలు ఇద్ద‌రి మ‌ధ్య ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎలాంటి టాక్ న‌డుస్తుంది? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిసింది త‌మ‌న్నా మీద‌.వీట‌న్నిటికీ ఓపిగ్గా స‌మాధానం చెప్పారు త‌మ‌న్నా.

- Advertisement -

ఎవ‌రో ఒక‌టీ అరా త‌ప్ప‌, చాలా మంది హీరోలు రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అస‌లు ఆ సీన్లు తెర‌కెక్కించేట‌ప్పుడు హీరోయిన్ల‌తో మాట్లాడ‌టానికి కూడా ఇబ్బందిప‌డ‌తారు. చాలా చాలా సిగ్గుప‌డుతూ ఆ స‌న్నివేశాలు చేసి వెళ్తారు. అంతేగానీ, ఆ స‌న్నివేశాలు అన‌గానే అమాంతం ఎంజాయ్ చేసేయాల‌నే క‌క్కుర్తి హీరోల‌లో ఉండ‌దు. అస‌లు ఆ స‌మ‌యంలో ఒక‌రితో ఒక‌రం మాట్లాడుకోవ‌డానికి కూడా ఇబ్బంది ప‌డ‌తాం. కాక‌పోతే డైర‌క్ట‌ర్‌, కెమెరామేన్ ఏం చెబితే అది చేసి వెళ్లిపోతాం. నాతో ప‌నిచేసిన చాలా మంది హీరోలు రొమాంటిక్ సీన్ల‌లో న‌టించ‌డానికి ఇబ్బందిప‌డిన వారే అని కుండ బ‌ద్ధ‌లు కొట్టింది త‌మ‌న్నా. బోల్డ్ విష‌యాలు చెప్ప‌డంలోనే కాదు, ఫ్యాష‌న్ విష‌యంలోనూ ఎప్పుడూ బోల్డ్ గా ఉంటారు త‌మ‌న్నా. ఒక్క‌సారి సినిమాకు క‌మిట్ అయితే, డైర‌క్ట‌ర్ ఏం చెబితే అది చేసి వెళ్తార‌ని, ఆమె అంత సిన్సియ‌ర్‌గా ఇంకెవ‌రూ ఉండ‌ర‌ని, ప‌ర్ఫెక్ట్ టైమింగ్స్ మెయింటెయిన్ చేస్తార‌ని త‌మ‌న్నాకు మంచి పేరు ఉంది. 2023లో త‌ను ఎదురుచూస్తున్న బెస్ట్ హిట్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు మిల్కీ బ్యూటీ. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న భోళాశంక‌ర్‌లో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు నార్త్ బ్యూటీ త‌మ‌న్నా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News