Tamannaah Bhatia..టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం పెళ్లి కోసం ఎదురు చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి ఇప్పుడే చేసుకోనని చెబుతున్నప్పటికీ, సినిమాల కంటే తన అటెన్షన్ పెళ్లి మీద, బాయ్ ఫ్రెండ్ మీదే ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే చాలా రోజుల నుండి ఈమె చేసిన సినిమాలు అంతగా హిట్ అవ్వకపోవడంతో ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాలో హైలెట్ అయ్యేలా ప్రవర్తిస్తోంది. దీంతో ఈమె అటెన్షన్ మొత్తం పెళ్లి మీదే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటి తమన్నా పెళ్లి టాపిక్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పెళ్లికి సిద్ధమైన తమన్నా..
సౌత్ ఇండస్ట్రీలో రాణించిన తమన్నా భాటియా నార్త్ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది.అయితే నార్త్ లో తమన్నా చేసిన సినిమాలు బెడిసికొట్టి మళ్లీ సౌత్ ఇండస్ట్రీనే దిక్కు అన్నట్లుగా ఇక్కడ సినిమాలు చేస్తోంది. అలా అని నార్త్ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా అక్కడ కూడా గెస్ట్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ప్రియుడు విజయ్ వర్మ (Vijay Varma) తోనే ఎంజాయ్ చేస్తోంది. సమయం దొరికితే చాలు వెకేషన్లు అంటూ ప్రియుడితో విదేశాల్లో వాలిపోతుంది. దీంతో మిల్కీ బ్యూటీ అభిమానులందరూ తమన్నాకి సినిమాల కంటే ప్రియుడి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా పెళ్లి గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమన్నా పెళ్లి వార్తలు రావడానికి ప్రధాన కారణం ప్రస్తుతం తమన్నా చేతిలో ఓదెల-2 (Odela-2) మూవీ మాత్రమే ఉంది.
అదే చివరి సినిమా కానుందా..?
ఈ సినిమా టీజర్ రీసెంట్గా మహా కుంభమేళలో రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఓదెల-2 పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో లేడీ అఘోరాగా తమన్నా కనిపించబోతుంది.ఇక ఇన్ని రోజులు గ్లామర్ రోల్స్ చేసిన తమన్నా ఒక్కసారిగా అఘోరా గెటప్ లోకి మారడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ ఉంది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చేతిలో కేవలం ఓదెల-2 మూవీ మాత్రమే ఉంది. ఇక ఈ సినిమా కూడా వచ్చే నెల విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మిల్క్ బ్యూటీకి సినిమాల్లో ఛాన్సులు లేవని తెలుస్తోంది. అయితే అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలెక్కాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమన్నా తన దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తూ విజయ్ వర్మ(Vijay Varma) తో పెళ్లి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి నిజంగానే తమన్నా విజయ్ వర్మతో పెళ్లికి రెడీ అయ్యిందా..లేక సినిమా ఆఫర్లు రావడం లేదా.. ఓదెల-2 తమన్నా చివరి సినిమానా? అనేది తెలియాల్సి ఉంది.