BigTV English

Henna Hair Dye: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా హెన్నాను ఇలా వాడితే తెల్లజుట్టు రానే రాదు

Henna Hair Dye: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా హెన్నాను ఇలా వాడితే తెల్లజుట్టు రానే రాదు

Henna Hair Dye: వయసు పైబడే కొద్ది తెల్లజుట్టు రావడం సహజం. సాధారణంగా వృద్ధాప్యానికి సూచికగా తెల్లజుట్టును పరిగణిస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. పైగా ఈ వైట్ హెయిర్ వల్ల వయసులో పెద్దవారిగా కనపిస్తారు. ఇక తెల్లజుట్టును కవర్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో దొరికే షాంపులు, హెయిర్ డైలు, ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరీగా పనిచేస్తాయి కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ యథావిధిగా తెల్లజుట్టు కనిపిస్తుంది. ఇలాంటివి తలకు అప్లై చేయటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


❄ కావాల్సిన పదార్ధాలు
⦿గోరింటాకు పొడి

⦿కాఫీ పొడి


⦿లవంగాలు

⦿గ్లాసు వాటర్

❄ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక గ్లాసు వాటర్, ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు, కాఫీ పొడి మూడు టేబుల్ స్పూన్ వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. వేరే గిన్నెలో కావాల్సినంత గోరింటాకు పొడి తీసుకుని.. అందులో తయారు చేసుకున్న వాటర్‌ను కొంచెం కొంచెం పోస్తూ బాగా మిక్స్ చేసి గంట పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత తలకు అప్లై చేసి 40 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. అంతేకాదు జుట్టు కూడా పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది కూడా.

తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు ఈ చిట్కాలు కూడా పాటించండి.

❄ కావాల్సిన పదార్ధాలు
⦿టీ పొడి

⦿దాల్చిన చెక్క

⦿లవంగాలు

⦿మిరియాలు

⦿షుగర్

❄ తయారు చేసుకునే విధానం
ముందుగా మిక్సీజార్ తీసుకుని అందులో టీపొడి, లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు నాలుగు, మిరియాలు ఐదు, పంచదార టీ స్పూన్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో గోరింటాకు పొడి, తయారు చేసుకున్న పౌడర్‌ని వేసి.. రెండిటిని వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత జుట్టుకు అప్లై చేసి సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేయండి చాలు మంచి ఫలితం ఉంటుంది. తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. క్రమంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు కలోంజీ సీడ్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. వీటిలో ఈ పదార్ధాలు కలిపి  జుట్టుకు అప్లై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
⦿లవంగాలు

⦿కలోంజీ విత్తనాలు

⦿మెంతులు

⦿కొబ్బరి నూనె

❄ తయారు చేసుకునే విధానం..
ముందుగా మూడు టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, మెంతులు రెండు టేబుల్ స్పూన్, లవంగాలు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెండు వారాలకు ఒకసారి ట్రై చేసి చూడండి. క్రమంగా తెల్లజుట్టు ఆగిపోతుంది. పైగా సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ టైంలో జుట్టు డ్రైగా అయిపోవడం, చుండ్రు కూడా ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఆ హెయిర్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×