E-Paper
Advertisement

Shiva Karthikeyan: కొడుకు బారసాల.. ఎమోషనల్ అయిన స్టార్ హీరో

Shiva Karthikeyan: కొడుకు బారసాల.. ఎమోషనల్ అయిన స్టార్ హీరో
Advertisement

Shiva Karthikeyan: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. రెమో సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా బిజీగా మారాడు.

ప్రస్తుతం శివకార్తికేయన్ చేతిలో దాదాపు మూడు సినిమాలు వరకు ఉన్నాయి. అందులో ఒకటి అమరన్. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

Advertisement

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ మధ్యనే ఈ హీరో ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ జంటకు ఆరాధన, గగున్ అనే పిల్లలు ఉన్నారు. జూలై 15 న శివకార్తికేయన్ భార్య ఆర్తీ మూడో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ బిడ్డ బారసాల ఘనంగా జరిపించారు. ఆ బిడ్డకు పవన్ అని నామకరణం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఆరాధన, గగున్, పవన్ అని ముగ్గురు పిల్లల పేరు రాస్తూ చివర్లో మూడు హార్ట్ ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు శివకార్తీకేయన్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

శివకార్తికేయన్ సొంత మరదలు ఆర్తీ. 2013 లో వీరి వివాహాం జరిగింది. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆమె ఎప్పుడు భర్తకు సపోర్ట్ గా నిలబడింది. ఈ విషయాన్నీ శివకార్తికేయన్ ఎన్నోసార్లు స్టేజిమీద కూడా చెప్పాడు. ఈ జంట ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×