E-Paper
Advertisement

Naga Panchami: నాగ పంచమి నాడు ఇలా చేస్తే నాగ దోషం పోతుంది..

Naga Panchami: నాగ పంచమి నాడు ఇలా చేస్తే నాగ దోషం పోతుంది..
Advertisement

Naga Panchami: వేద జ్యోతిష్యం ప్రకారం హిందూమతంలో నాగపంచమి ప్రధాన పండుగలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున వచ్చే నాగపంచమి నాడు నాగ దేవతను పూజించడం ఆనవాయితి. అయితే అందరూ నాగదేవతను పూజించి, తమ కోరికలను తీర్చాలని ప్రార్థిస్తుంటారు. అయితే చాలా మంది ఎక్కువగా కాలసర్ప తోషం, నాగ దోషం వంటి వాటితో బాధఫడుతుంటారు. ఇలా దోషాలతో బాధపడేవారు నాగపంచమి నాడు నాగ దేవతను నిష్టగా పూజిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ ఏడాది నాగుల పంచమి ఏ సమయంలో వచ్చింది, శుభ సమయంకు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం.

నాగ పంచమి ఎప్పుడు ?

Advertisement

హిందూ క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజున నాగ దేవతను పూజిస్తారు. అయితే నాగ పంచమి తిథి 9వ తేదీన ఉదయం 8.15 గంటలకు ప్రారంభమై తిరిగి 10వ తేదీన ఉదయం 6.09 గంటలకు ముగుస్తుంది.

శుభ సమయం

Advertisement

నాగ పంచమి 9వ తేదీన మధ్యాహ్నం 12.13 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అనుకూల సమయం ఉంటుంది. అయితే ప్రదోష కాలంలో నాగదేవతను పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రదోష కాలం సాయంత్రం 6.33 నుండి 8.20 వరకు ఉంటుంది. నాగ పంచమి నాడు చేసే పూజల కారణంగా నాగ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. పాములను పూజిస్తే కుటుంబాన్ని పాముల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు. అందువల్ల నాగపంచమి నాడు నాగ దేవతకు పూజలు చేసి పాములను పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మరోవైపు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే కూడా నాగ సంచమి నాడు పూజలు చేయాలని అంటారు. ఎందుకంటే శివుడికి పాములు అంటే ఇష్టం. శివుడి మెడలో అలంకారంగా పామును కూడా ధరిస్తాడు. అందువల్ల పాముని నాగ దేవతగా పూజిస్తారు. అయితే నాగుపాముని పూజించడం వల్ల శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని నమ్ముతారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×