BigTV English

Tamil Film Industry: చిన్న తెలుగు సినిమా కి థియేటర్స్ ఇవ్వలేం అని చేతులు ఎత్తేస్తున్నారు

Tamil Film Industry: చిన్న తెలుగు సినిమా కి థియేటర్స్ ఇవ్వలేం అని చేతులు ఎత్తేస్తున్నారు

Tamil Film Industry: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి తెలుగు ఆడియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను ప్రేమించినంతగా మరో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రేక్షకులు ప్రేమించరు అనేది కూడా వాస్తవం. చాలా ఇతర భాష సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కొన్నిసార్లు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా కూడా సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. ఒక సినిమా నచ్చితే ఆ సినిమా గురించి పదిమందికి షేర్ చేస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెడతారు. ఇలా చాలా ఇతర భాష సినిమాలను తెలుగు ఆడియన్స్ లేపారు అని చెప్పాలి. ఎన్నో తమిళ్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి. కానీ తెలుగు సినిమాలకు సరైన ఓపెనింగ్స్ తమిళ్ లో రావు. ఓపెనింగ్స్ పక్కన పెడితే కొన్నిసార్లు థియేటర్స్ కూడా దొరకని పరిస్థితి.


మామూలు సీజన్లో కంటే సంక్రాంతి సీజన్ లో సినిమాలు ఏ స్థాయిలో రిలీజ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి దిల్ రాజు సంక్రాంతి సీజన్లో ఒక సినిమాను రిలీజ్ చేస్తారు. ఇక చాలా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి డేట్స్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు సరైన డేట్స్ దొరక్క వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతమంది పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా కొన్ని తమిళ్ సినిమాలకు ఖచ్చితంగా థియేటర్స్ లభిస్తాయి. అలానే ప్రతి పండగ సీజన్ కి తమిళ్ సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ దక్కుతుంది.

ఇక అసలైన విషయం ఏమిటంటే కిరణ్ అబ్బవరం హీరోగా క అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి సంబంధించి చాలావరకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. వరుస డిజాస్టర్ సినిమాలు తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. తన కెరీయర్ లోని హైయెస్ట్ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను చేశారు. అయితే అన్ని భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల అవుతుంది కానీ తమిళ్లో మాత్రం వారం రోజులు లేటుగా విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా దీపావళి సీజన్ కాబట్టి తమిళ్లో చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి అందువలన సరైన థియేటర్స్ ఈ సినిమా కోసం దొరకకపోవచ్చు అని కొంతమంది తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చెబుతున్నారట. అయితే దీని గురించి ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.


ఇకపోతే చాలా సందర్భాల్లో పెద్ద తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకు మంచి థియేటర్స్ లభించాయి. అంతేకాకుండా చాలామంది తమిళ్ హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అటువంటిది ఒక చిన్న సినిమాకి థియేటర్స్ దొరకపోవడం ఏంటి అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి థియేటర్స్ లేవని చేతులెత్తేయడంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీనిపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×