BigTV English

Tapsee Pannu:- వివాదంలో తాప్సీ.. కేసు న‌మోదు

Tapsee Pannu:- వివాదంలో తాప్సీ.. కేసు న‌మోదు

Tapsee Pannu:- తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరోయిన్ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూ న‌టిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న ఈ సొట్ట‌బుగ్గ‌ల అమ్మడుకి వివాదాలేం కొత్తేం కాదు. తెలుగులోనే హీరోయిన్‌గా కెరీర్‌స్టార్ట్ చేసి క్ర‌మంగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు ఇక్క‌డ అడ‌పాద‌డ‌ప మాత్ర‌మే సినిమాలు చేస్తుంది. ఇప్పుడు సొగ‌స‌రి మ‌రో కొత్త వివాదంలో చిక్కుకుంది. రీసెంట్‌గా ఆమె ముంబైలో జ‌రిగిన ఓ ప్యాష‌న్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఇండియాలో ప్యాష‌న్‌షోలో పాల్గొంటే త‌ప్పేం కాదే అనే సందేహం రాక మాన‌దు.


అయితే అస‌లు విష‌య‌మేమంటే.. తాప్సీ తాను పాల్గొన్న ప్యాష‌న్ షోలో ల‌క్ష్మీదేవి లాకెట్‌ను ధ‌రించింది. దీనిపై కొంద‌రు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. తాప్సీ హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిందంటూ ఆమెపై కేసు పెట్ట‌టానికి కూడా వెనుకాడ‌లేదు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏక‌ల‌వ్య గౌర్.. తాప్సీ ప‌న్నుపై పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. ర్యాంప్ వాక్ చేసే స‌మ‌యంలో తాప్సీ ల‌క్ష్మీదేవి లాకెట్‌ను ధ‌రించ‌టం హిందువుల మ‌నో భావాలు దెబ్బ తిన్నాయ‌ని కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

తాప్సీకి, కంగ‌నా ర‌నౌత్‌కి అస్స‌లు ప‌డ‌దు. అలాగే ఆ మ‌ధ్య ఓసారి టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై తాప్సీ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. హీరోయిన్‌గా లైఫ్ ఇచ్చిన సౌత్‌పై తాప్సీ కామెంట్స్ చేయ‌టంతో ఆమెపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలా ఆమె కొన్ని వివాదాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుచుకుంది. అయితే పోలీస్ కంప్లైంట్ వ‌ర‌కు వెళ్ల‌టం ఇదే తొలిసారి. మ‌రి దీనిపై ఈ బాలీవుడ్ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుంది.. ఏమ‌ని స‌మాధానం ఇస్తుంది? అనేది చూడాలి మ‌రి. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. అయితే ఆమెకు తెలుగులో ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. కానీ క్రమంగా ఆమె మా డ్యామేజ్‌ను దాటి దాటి దాన్ని ఇమేజ్‌గా మలుచుకుంది.


చైతు-శోబిత.. దొరికిపోయిన డేటింగ్ కపుల్స్!

for more updates follow this link:-Bigtv

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×