BigTV English

Taraka Ratna: వాళ్లు మ‌న‌ల్ని ప‌దే ప‌దే బాధ పెట్టారు.. తార‌క‌ర‌త్న భార్య పోస్ట్ వైర‌ల్

Taraka Ratna: వాళ్లు మ‌న‌ల్ని ప‌దే ప‌దే బాధ పెట్టారు.. తార‌క‌ర‌త్న భార్య పోస్ట్ వైర‌ల్

Taraka Ratna: తారక‌ర‌త్న భార్య అలేఖ్య రెడ్డి భ‌ర్త జ్ఞాప‌కాల నుంచి అంత త్వ‌ర‌గా బ‌య‌కు రాలేక‌పోతుంది. సోష‌ల్ మీడియాలో త‌న కుటుంబం, తార‌కర‌త్న‌తో ఉన్న అనుబంధానికి సంబంధించి ప‌లు పోస్టుల‌ను ఆమె పెడుతూనే ఉంది. తాజాగా మ‌రోసారి ఆమె తన సోషల్ మీడియాలో చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ‘మన పరిచయం ప్రేమగా మారిన తర్వాత నాలో తెలియని సందిగ్ధత ఉండేది. కానీ నువ్వు అలా లేవు. నన్ను పెళ్లి చేసుకోవాల‌నే స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చావు. అయితే అదే నిర్ణ‌యం మ‌న‌ల్ని అంద‌రికీ దూరం చేసింది. మాన‌సిక ఒత్తిడికి గురి చేయ‌ట‌మే కాకుండా అర్థిక ఇబ్బందుల‌ను కూడా క‌లిగించింది.


పెళ్లి త‌ర్వాత కొంద‌రు మ‌న‌ల్ని ద్వేషించారు. వారి ద్వేషాన్ని చూడ‌లేక‌.. మ‌నం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్నాం. అయినా కూడా వాళ్లు మ‌న‌ల్ని ప‌దే ప‌దే బాధ పెట్టారు. కుటుంబానికి దూరం కావ‌టంతో నువ్వు పెద్ద కుటుంబాన్ని కావాలని భావించావు. పిల్లలు పుట్టిన తర్వాత మనం జీవితంలో సంతోషం నిండింది. నువ్వు రియల్ హీరోవి మనం మళ్లీ కలుస్తాం’ అని తన పోస్టులో పేర్కొన్న అలేఖ్య రెడ్డి బాలకృష్ణ‌కు, విజ‌య్‌సాయి రెడ్డిల‌కు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు.

నారా లోకేష్ పాద‌యాత్ర యువ గ‌ళం ప్రారంభం రోజున తార‌క‌ర‌త్న‌కు ఉన్న‌ట్లుండి గుండె పోటు రావ‌టంతో అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. వెంటనే ఆయ‌నకు ప్రాథ‌మిక చికిత్స‌ను అందించి బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాలయ హాస్పిట‌ల్‌కు పంపించి విదేశీ డాక్ట‌ర్స్‌తో చికిత్స ఇప్పించారు. వెంటిలేట‌ర్‌పై 23 రోజుల పాటు తారక‌ర‌త్న‌కు ట్రీట్‌మెంట్‌ను అందించారు. అయితే కూడా ప‌రిస్థితి చేయి దాటిపోవ‌టంతో తార‌క‌ర‌త్న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చయేాలని తారకరత్న భావించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం నందమూరి కుటుంబంలో చోటు చేసుకుంది.


Vishwak Sen: అర్జున్‌తో వివాదంపై విశ్వ‌క్ సేన్ రియాక్ష‌న్‌

Manchu Mohan Babu: ప‌గ‌వాడికి కూడా నా క‌ష్టాలు రాకూడ‌దు: మోహ‌న్ బాబు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×