BigTV English

Married women:పెళ్లైన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేయకూడదా..

Married women:పెళ్లైన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేయకూడదా..


Married women:తలస్నానం చేసే వాళ్లు కొన్ని నియమాలు పద్దతులు పాటించాలంటోంది శాస్త్రం. ఆడవారికి, మగవారికి వేర్వేరుగా పద్దతులు ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు హెడ్ బాత్ చేయకూడదు. ముఖ్యంగా పెళ్లయిన ఆడవాళ్లు తలస్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని…. ఆర్థిక పరమైన సమస్యలతో నష్టపోతారని పెద్దలు చెబుతున్నారు. పెళ్లయిన మహిళలు సోమ, బుధ, శనివారాల్లో మాత్రమే తలంటు పోసుకోవాలి.

సోమవారం నాడు తలస్నానం చేస్తే ఆ మహిళ నిత్య సౌభాగ్యవతిగా ఉంటుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శనివారం తలంటు పోసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.


మంగళ, గురు, శుక్రవారాల్లో తలస్నానం చేయకూడదు. తప్పదు అనుకుంటే మాత్రం మంగళ, శుక్ర వారాల్లో తలంటు పోసుకోవచ్చు. గురువారం నాడు తలస్నానం చేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో కూడా మహిళలు తలస్నానం చేయవద్దు.

పురుషులు ఈ రోజుల్లోనే తలస్నానం చేయాలి?
పురుషులు సోమవారం తలస్నానం చేస్తే వారి అందం రెట్టింపవుతుంది. మంగళవారం తలస్నానం విపరీత దుఖానికి కారణం అవుతుంది. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

గురువారం తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అప్పుల్లో కూరుకుపోతారని శాస్త్రం చెబుతోంది. అలాగే శుక్రవారం తలస్నానం చేయడం మంచిది కాదని…. ఈ రోజు తల స్నానం చేస్తే అనుకోని ఆపదలు ఎదురవుతాయి.

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×