BigTV English

Sai Pallavi: రెండు ఫిలింపేర్ అవార్డులు అందుకున్న సాయిపల్లవి.. సెలబ్రేట్ చేసిన తండేల్ టీమ్

Sai Pallavi: రెండు ఫిలింపేర్ అవార్డులు అందుకున్న సాయిపల్లవి.. సెలబ్రేట్ చేసిన తండేల్ టీమ్

Sai Pallavi latest news(Cinema news in telugu): ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హైబ్రిడ్ పిల్లలా నిలిచిపోయింది. నిజంగానే సాయిపల్లవి హైబ్రీడ్ పిల్ల అనే చెప్పాలి. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప డబ్బు కోసం కానీ, గ్లామర్ చూపించుకోవడానికే కానీ, నేమ్, ఫేమ్ కోసం కానీ ఏరోజు ఎగబడలేదు. అందుకే ఆమె అంటే ప్రేక్షకుల్లో ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలా నటించింది కాబట్టే సాయిపల్లవి వెంటనే అవార్డులు వస్తూ ఉంటాయి.


ఇప్పటివరకు సాయిపల్లవి 10 సార్లు ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యింది. అందులో 6 సార్లు అవార్డును సొంతం కూడా చేసుకుంది. ఇక ఈసారి ఒకేసారి.. ఒకటి కాదు రెండు అవార్డులను సొంతం చేసుకొని మిగతా హీరోయిన్లు కుళ్ళుకోనేలా చేసింది. ఫిలింఫేర్ 2023 అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా సాయిపల్లవి రెండు అవార్డులను సొంతం చేసుకుంది.

లవ్ స్టోరీ, గార్గి సినిమాలకు ఆమె ఈ అవార్డులను అందుకుంది. ఇక ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడంతో ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.


చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి ఈ సెట్ లో అడుగుపెట్టగానే చిత్రబృందం..ఆమెకు బిగ్ సర్ ప్రైజ్ ను ఇచ్చింది. ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడంతో తండేల్ టీమ్ సాయిపల్లవికి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ లో చై కనిపించలేదు. ఇకపోతే తండేల్  సినిమాలో సత్య అనే పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి అవార్డును అందిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×