BigTV English

Tollywood Heroine : నలుగురితో డేటింగ్.. కానీ ఆ ఒక్కటే ఎక్కువ.. హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

Tollywood Heroine : నలుగురితో డేటింగ్.. కానీ ఆ ఒక్కటే ఎక్కువ.. హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ ఇలాంటివి కామన్.. కొన్ని జంటలు ప్రేమించిన వారికోసం ఏదైనా చేసేస్తున్నారు.. ఇక ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా బ్రేకప్ చెప్పేస్తున్నారు. తరచూ ఆ వార్తలు హైలెట్ గా నిలుస్తాయి. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తన సాడ్ బ్రేకప్ స్టోరీస్ ను పంచుకుంది.. ఆ హీరోయిన్ ఏకంగా నలుగురితో బ్రేకప్ చెప్పేసి అందరికి షాక్ ఇచ్చేసింది. ఇంతకీ ఆమె లవ్ చేసిన బాయ్ ఫ్రెండ్స్ ఎవరు? అసలు ఎందుకు బ్రేకప్ చెప్పేసింది అనేది దానిగురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె వివరంగా చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. క్రేజీ హీరోయిన్ తేజెస్వి మదివాడ.. ఐస్ క్రీమ హీరో తేజస్వి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ ఫేమ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాలో సమంత కు సిస్టర్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీతో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ఆ సినిమాలో పాప నటనకు యావత్ సినీ అభిమానులు ఫిదా అయ్యారు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఇక వివాదాస్పద దర్శకుడు ఆర్జివి తెరకేక్కించిన ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ మూవీలో పాప బోల్డ్నెస్ కు కుర్రకారు ఫ్లాట్ అయ్యారు.

ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తరువాత హార్ట్ ఎటాక్, మనమంతా, అనుక్షణం, కేరింత, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, మిస్టర్ తదితర సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ తరుణంలో 2018లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టి.. బీబీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఓటీటీ పై కన్నేసిన ఈ అమ్మడు. ప్రస్తుతం ఖాళీ లేకుండా వరుసగా వెబ్ సిరీస్ లను లైన్లో పెడుతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. అందులో తన పర్సనల్ విషయాలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలు వెబ్ స్టోరీస్ చేస్తుంది.


తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తేజు రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యింది.. బిగ్ బాస్ తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ షో తర్వాత తన లవ్ బ్రేకప్ అయిందని, మనీ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డానన్నారు. తాను ఇప్పటివరకు నలుగురిని ప్రేమించానని, కానీ, వారందరూ తనని మోసం చేసి వెళ్లిపోయారని అన్నారు. కానీ తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని, వారు ప్రేమిస్తున్నారా లేదా అనేది తనకు తెలియదు అన్నారు. ప్రేమనేది తెలియకుండానే కలిగే భావన అని అందుకే నలుగురితో ప్రేమాయణం సాగించినట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ ఇంటర్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక తేజు రీసెంట్ గా అర్థం అయ్యిందా అరుణ్ కుమార్ 2 వెబ్ సిరీస్ లో నటించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×