Matka Movie : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా.. చిల్డ్రన్స్ డే సందర్బంగా నిన్న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కానీ అనుకున్న హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. అటు కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయని టాక్.. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..
వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. గత ఏడాది చివరగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా చేసాడు.. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వరుణ్ తేజ్. ప్రయోగాలు చేస్తున్న, డిఫరెంట్ కంటెంట్ మూవీ చేస్తున్న సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని రతన్ ఖేత్రి అనే మట్కా గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ కూడా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 1950 నుంచి 1980 వరకు నడిచిన స్టోరీగా మట్కాను ప్రిపేర్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్ వాసు అనే గ్యాంగ్‌స్టర్ పాత్ర లో నటించాడు. కటిక పేదరికం లో పుట్టిన వాసు.. మట్కా గ్యాంబ్లింగ్ తో ఎలా కోటీశ్వరుడు అవుతాడన్నది ఈ సినిమా కథ.. మాస్ యాక్షన్ కథగా వచ్చిన ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. దాంతో సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీ కూడా వరుణ్ కు సరైన హిట్ ను ఇవ్వలేదు. థియేటర్ల లో పెద్దగా ఆకట్టుకోలేని ఈ మూవీ భారీ ధరకు ఓటీటీ డీల్ ను లాక్ చేసుకుంది. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ .. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది. ఇన్ పుట్స్ ప్రకారం.. మట్కా మూవీ డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశముంది. ఈ కలెక్షన్స్ ను బట్టి డేట్ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ ఈ మూవీ తర్వాత మరో రెండు ప్లాజెక్ట్ లకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సినిమా యావరేజ్ టాక్ ను అందుకోవడంతో ఆ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకోనున్నాడని టాక్..