E-Paper
Advertisement

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
Advertisement

Telugu Film Chamber Elections: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఈసారి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం కల్పించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్లకోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. అధ్యక్ష పదదికి ఠాగూర్ మధు పోటీ చేశారు. ఇందులో భరత్ 29 ఓట్లు రాగా, ఠాగూర్ 17 ఓట్లు వచ్చాయి.

Advertisement

మరోవైపు, ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీపడగా.. అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అశోక్ కుమార్‌కు 28 ఓట్లు.. వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు పోలయ్యాయి. అయితే ఉపాధ్యక్షుడిగా నిర్మాతల నుంచి ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 46 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×