BigTV English

Road Damage: గోషామహల్‌లో రోడ్డు కుంగడంతో బోల్తా పడిన డీసీఎం..వీడియో వైరల్

Road Damage: గోషామహల్‌లో రోడ్డు కుంగడంతో బోల్తా పడిన డీసీఎం..వీడియో వైరల్

Road Damage in Hyderabad: హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఓ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. చాక్నవాడిలో రోడ్డు కుంగడంతో అక్కడే మలుపు తీసుకుంటున్న డీసీఎం బోల్తా పడింది. అయితే ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డీసీఎం కిందపడుతుండగా.. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను అక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రోడ్డు కుంగడంతోనే డీసీఎం వాహనం బోల్తా పడిందని స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయంలో వాహనం పక్కన ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా, డీసీఎంలోని బస్తాలను మరో వాహనంలోకి తరలించారు. గత కొంతకాలంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై నీళ్లు చేరి దెబ్బతిందని అధికారులు అనుకుంటున్నారు.


ఇదిలా ఉండగా, గతేడాది కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగింది. మళ్లీ రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.5కోట్లు ఖర్చు చేసి రోడ్డును నిర్మించారు. అయితే ఏడాది గడవకముందే రోడ్డు మరోసారి కుంగిపోయింది. నాసిరకంగా రోడ్డు వేయడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఒక్కసైడు మాత్రమే వేశారని, రెండు సైడ్స్ రోడ్డు వేయాలని స్థానికులు చెప్పినా పట్టించుకోలేదని అంటున్నారు.

Also Read: తెలంగాణ కొత్త గవర్నర్ నియామకం వెనుక అంత పెద్ద ప్లాన్ ఉందా?

జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టు దక్కించుకున్న వారి నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందంటున్నారు. నాలా కూడా కుంగిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని భవిష్యత్తులో ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

Indore Crime News: బ్రేకప్ చెప్పిందని బైక్‌తో ఢీ కొట్టిన యువకుడు, వీడియో వైరల్

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Big Stories

×