BigTV English

kalki 2898 Ad update : మూవీకే ఆ సీన్ హైలెట్ .. కల్కి నుంచి క్రేజీ అప్డేట్.. 

kalki 2898 Ad update : మూవీకే ఆ సీన్ హైలెట్ .. కల్కి నుంచి క్రేజీ అప్డేట్.. 
This image has an empty alt attribute; its file name is 1f254dcb0a7ea1f7710c9d7e7c837a13.jpg

kalki 2898 ad update : ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 AD’ . సైంటిఫిక్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ మూవీ లో ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని టాక్. ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ పిక్ .. గ్లింప్స్ వీడియో  మూవీ పై ఒక అవగాహన కలిగించడమే కాకుండా అంచనాలను కూడా భారీగా పెంచాయి.


ఈ మూవీ ఫ్యూచర్ ఓరియంటెడ్ గా ఉంటుంది అన్న విషయం వీడియోలో స్పష్టంగా అర్థం అయింది. ఇక ఇందులో బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ అమితాబచ్చన్.. దీపిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లతో పాటుగా కమల్ హాసన్ ఈ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అతని పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ మూవీ నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కల్కి మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందట. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ లోని ఒక సాలిడ్ వేరియేషన్ కూడా మనకు ఈ సీక్వెన్స్ ద్వారానే రివీల్ చేస్తారట. మొత్తానికి ఈ ఇంటర్వెల్స్ సన్నివేశం చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తోంది. ఈ మూవీలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే .. అయితే ఈ క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుందట. మూవీలో కొన్ని కీలకమైన మలుపులకు కారణం కూడా అమితాబ్ పాత్రే అని తెలుస్తోంది.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా.. మునుపెన్నడు కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి మే 9న కల్కి చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ఈ చిత్రం అనుకున్నట్లుగానే మేలో వస్తుందా లేక వాయిదా పడుతుందా అనేది తెలియదు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×