BigTV English

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు

Cyclone Michaung Update : నెల్లూరు జిల్లా మైపాడు, రామతీర్థం మధ్య ముత్తుకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుంటటంతో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో గత రాత్రి నుండి జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక చోట్ల మొబైల్ నెట్ వర్క్స్ ఆగిపోయాయి. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాలంగి ఉధృతికి జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరుకుంది. దాంతో నెల్లూరు నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి.


భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో తీవ్ర స్థాయిలో వర్షపునీరు నిలిచిపోవటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం కావలి ఉప్పరపాలెం వద్ద మిచౌంగ్ తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి కొనసాగుతుంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుడండతో సముద్రం ముందుకు వచ్చింది. తుపాను తీరందాటినా.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

.


.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×