E-Paper
Advertisement

The Greatest Of All Time: నిన్ను కన్న కలలే సాంగ్.. చిత్రమ్మ వాయిస్ కు ఫిదా కాకుండా ఉండలేమే

The Greatest Of All Time: నిన్ను కన్న కలలే సాంగ్.. చిత్రమ్మ వాయిస్ కు ఫిదా కాకుండా ఉండలేమే
Advertisement

The Greatest Of All Time: దళపతి విజయ్, స్నేహ జంటగా నటిస్తున్న చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ మధ్యనే గోట్ సినిమా నుంచి మొదటి సాంగ్ ను తమిళ్ లో రిలీజ్ చేసారు. ఇక ఇప్పుడు అదే సాంగ్ ను తెలుగులో రిలీజ్ చేసారు. నిన్ను కన్న కలలే అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్.. ఏ సినిమాలో అయినా ఒక మెలోడి సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ముఖ్యంగా అమ్మ పాట అయితే కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఈ సాంగ్ కూడా అలానే కనిపిస్తుంది.

Advertisement

నిన్ను కన్న కలలే మెరిసెనుగా.. కన్నపేగు మరలా మురిసెనుగా అంటూ సాగిన ఈ సాంగ్ ఎంతో వినసొంపుగా ఉంది. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. చిత్రమ్మ వాయిస్ ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక SP చరణ్.. తన వాయిస్ తో SPB ని గుర్తుచేశాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక వీడియోలో విజయ్.. స్నేహ, ఒక బాబుతో కలిసి ఆడుకుంటున్నట్లు కనిపించాడు. లిరిక్స్ లో మాత్రం.. చాలాకాలం తరువాత ప్రేమ దొరికిన వ్యక్తి అన్నట్లు చెప్పుకొచ్చారు. యువన్ శంకర్ రాజా లిస్ట్ లో మరో మెలోడీ పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ది గోట్ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×