BigTV English

Hardik Pandya: నటాషాతో విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya: నటాషాతో విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా

Cricketer: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు ప్రకటించారు. తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్టు తెలిపారు. విడాకుల విషయాన్ని దంపతులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయం అని పేర్కొన్నారు. వారు విడిపోయినా మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు.


మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, డ్యాన్సర్ నటాషా స్టాన్‌కోవిక్, హార్దిక్ పాండ్యా 2020 మే 31వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఈ దంపతులు హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహమాడారు.

ఇన్‌స్టా పోస్టులో నటాషా ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. నాలుగేళ్లు తాము కలిసి ఉన్నామని, ఇప్పుడు పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కలిసి ఉండటానికి తాము శాయశక్తులా ప్రయత్నించామని, కానీ, ఇద్దరి ప్రయోజనాల, ఇద్దరి మంచి కోసం తాము విడిపోవడమే సరైందని నమ్ముతున్నామని వివరించారు. ఒక కుటుంబంగా ఎదిగిన తమకు, పంచుకున్న సంతోషం, ఇచ్చిపుచ్చుకున్న గౌరవం దృష్ట్యా తాము విడిపోవాలనే నిర్ణయం చాలా కఠినమైందని తెలిపారు.


 

View this post on Instagram

 

తమ దాంపత్యంలో అగస్త్య జన్మించారని, తమ జీవితంలో అగస్త్య కేంద్రస్థానంలో ఉంటాడని నటాషా వివరించారు. అగస్త్య సంతోషంగా ఉండటానికి తమతో సాధ్యమైన ప్రతీది కో పేరెంట్‌గా అందిస్తామని తెలిపారు. ఈ సున్నిత, కష్టతరమైన సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని, తమ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్.. ఇండియా టీం ఇదే

వీరిద్దరి విడాకులపై మే నెల నుంచి రూమర్స్ మొదలయ్యాయి. నటాషా మే నెలలోనే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పేరులో పాండ్యాను తొలగించింది. దీంతో చాలా మందిలో వీరిద్దరు విడిపోతున్నారనే అభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోతున్నారా? అనే టైటిల్‌తో ఓ రెడ్డిట్ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత కాలంగా వీరిద్దరు కలిసి ఎందుకు పోస్టులు పెట్టడం లేదని, ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను వీక్షించడానికి నటాషా ఎందుకు రాలేదనే ప్రశ్నలతో ఆ పోస్టు ఉన్నది. అప్పుడే చాలా మంది విడాకుల అభిప్రాయాలు వచ్చాయి. ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఈ దంపతులు అధికారికంగా తమ విడాకులను ధ్రువీకరించారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×