E-Paper
Advertisement

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్
Advertisement

The Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలు మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) నుంచి కొత్త లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ చూడడానికి స్టైలిష్ గానే ఉన్నప్పటికీ రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా లుక్ కు కాపీలా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్, గ్లిప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అక్టోబర్ 23న ప్రభాస్ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ‘ది రాజా సాబ్’ మేకర్స్ ప్రభాస్ కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. అప్పుడెప్పుడో ప్రభాస్ ఈ సినిమా నుంచి లుంగీ లుక్ తో అదరగొట్టగా, ఆ తర్వాత సూట్ ధరించిన ఫోటోలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ప్రభాస్ గళ్ళ చొక్కా, నల్ల ప్యాంటు ధరించిన ఒక స్టైలిష్ లుక్ పోస్టర్ ను వదిలారు. అయితే ఈ పోస్టర్ పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రభాస్ న్యూ లుక్ ను రవితేజ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రాజా ది గ్రేట్’ (Raja The Great)తో పోలుస్తున్నారు. చేతిలో స్టిక్ ఒక్కటే తక్కువ, ‘రాజా ది గ్రేట్ 2’ అంటూ దాన్ని కూడా యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ లుక్ ను బాగానే మార్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా అభిమానులకు కావాల్సింది ప్రభాస్ స్టైలిష్ లుక్. మేజర్స్ దాన్ని చేసి చూపించారు. ప్రభాస్ ఈ సినిమాలో మిర్చి తర్వాత స్టైలిష్ గా కనిపించబోతున్నారు.

ట్రోల్లింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా నుంచి అక్టోబర్ 23న రాయల్ ట్రీట్ ఉండబోతోంది అంటూ ఈ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాబోతోందని ప్రచారం జోరు అందుకుంది. ఓవైపు అభిమానులు, మరోవైపు ట్రోలర్స్ కారణంగా ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ వైరల్ గా మారింది.

Advertisement

ఇదిలా ఉండగా రవితేజ అంధుడిగా నటించి అదరగొట్టిన సినిమా ‘రాజా ది గ్రేట్’ (Raja The Great). డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. 2017 లో రిలీజైన ఈ కామెడీ ఎంటర్టైనర్ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లలో ఒకటి. మరి ఈ సినిమాతో పోలిక కన్పిస్తున్న ‘ది రాజా సాబ్’ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×