E-Paper
Advertisement

Kalki2898AD: ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్ రా మావా.. నెక్స్ట్ లెవెల్ అంతే

Kalki2898AD: ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్ రా మావా.. నెక్స్ట్ లెవెల్ అంతే
Advertisement

Kalki2898AD movie update(Today tollywood news): ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.. కల్కి ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాలు తీయడం అందరికి తెలుసు.. కానీ, పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కొంతమందికే తెలుసు. ఆ కొంతమందిలో నాగ్ అశ్విన్ ఒకడు. బక్కగా ఉన్నాడు. సింపుల్ గా కనిపిస్తాడు అని తక్కువ అంచనా వేయడానికి లేదు. బుర్ర నిండా ఆలోచనలే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

నాగి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కల్కి2898AD. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 27 న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే కల్కి నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.

Advertisement

అసలు ఇది తెలుగు సినిమానా.. ? ఇంగ్లిష్ సినిమానా అనే డౌట్ వచ్చింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అలాంటి సినిమాకు ప్రమోషన్స్ అంటే ఎలా ఉండాలి.. కచ్చితంగా ఇలాగే ఉండాలి. ఇప్పటికే బుజ్జితో కల్కికి ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చి వదిలారు. ఇప్పుడు మునుపెన్నడూ లేనివిధంగా కల్కి కాన్వాయ్ ను దింపారు. పొలిటీషియన్స్ కు కాన్వాయ్ విన్నాం కానీ, సినిమాకు కాన్వాయ్ ఏంటి అనుకుంటున్నారా.. ? అదే నాగి మ్యాజిక్.

కల్కి కాన్వాయ్ లో కొన్ని కార్లకు ఎల్ ఈడీ లు పెట్టి.. అందులో కల్కి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ను చూపిస్తూ దేశం మొత్తం తిప్పుతున్నారు. అంటే ప్రేక్షకుల వద్దకు కల్కి వెళ్తుందన్నమాట. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రమోషన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్ రా మావా.. నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కల్కితో ప్రభాస్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×