E-Paper
Advertisement

The Vaccine War:- వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వాక్సిన్ వార్’ షూటింగ్‌లో గాయపడిన నటి పల్లవి జోషి

The Vaccine War:- వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వాక్సిన్ వార్’ షూటింగ్‌లో గాయపడిన నటి పల్లవి జోషి
Advertisement

The Vaccine War :-

‘ది కాశ్మీర్ ఫైల్స్’తో సంచలన సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ది వాక్సిన్ వార్’ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకంపై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సెట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలియజేసింది.

ది వాక్సిన్ వార్ లో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు. 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×