Lavanya Tripathi : సమంత బాటలోనే లావణ్య .. అదే జరిగితే పాపం వరుణ్..

Lavanya Tripathi : సమంత బాటలోనే లావణ్య .. అదే జరిగితే పాపం వరుణ్..

Lavanya Tripathi
Share this post with your friends

Lavanya Tripathi : అక్కినేని అందగాడు నాగచైతన్య.. సమంత పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి.. కొన్నాళ్లు సహజీవనం చేసి మరి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లయిన కొత్తలో జంట అంటే ఇలా ఉండాలి అని అందరూ మురిసిపోయారు. అయితే కొంతకాలానికి ఎవరు ఊహించని విధంగా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు ఇలా విడిపోవడం అక్కినేని ఫ్యామిలీ తో పాటు అందరినీ షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు వేరువేరుగా ఎవరి కెరీర్ పై వారు దృష్టి పెట్టి ఉన్నారు.

వాళ్లు విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఏ కారణం చేత విడిపోయారు అనే విషయం పై ఎవరికి స్పష్టత లేదు. విడిపోయాము అని అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా వీళ్ళిద్దరి గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మెగా కోడలు లావణ్య కూడా సమంత చేసిన ఆ తప్పే రిపీట్ చేస్తుందేమో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సమంత పెళ్లయిన కొత్తలో అక్కినేని కుటుంబం ఆమెకు ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. అయితే సమంత మాత్రం పెళ్లయిన తర్వాత చైతుతో హ్యాపీగా గడపాలని ఫిక్స్ అయిందట. కానీ పెళ్లయిన కొన్ని రోజులకే సమంతకు మంచిగా మూవీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. తన కెరీర్ పై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో సమంత కూడా మొదట వాటికి ఓకే చెప్పింది. గుర్తింపు మోజులో పడి ఆ తర్వాత మెల్లగా బాగా బోల్డ్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది..

అదిగో అక్కడ వచ్చింది అసలు సమస్య. సమంత నటించిన కొన్ని బోల్డ్ సీన్స్ కారణంగా చైతన్య, సమంత మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. అందుకే ఇద్దరికీ విడాకులు జరిగాయి అని ఓ రూమర్ ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ మొత్తానికి చాలామంది సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించిన తరువాతే ఆమె లైఫ్ లో డిస్టబెన్స్ మొదలయ్యాయి అని అంటారు.

ఇటు మెగా కుటుంబం కూడా కొత్త పెళ్లికూతురు లావణ్య సినీ కెరీర్ విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టలేదట. మెగా కోడలు కావడంతో లావణ్యతో మూవీస్ చేయడానికి కొందరు డైరెక్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ లావణ్య మూవీస్ కు తిరిగి ఓకే చెబితే.. సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో అని నెటిజెన్స్ భావిస్తున్నారు. మరి మెగా కోడలు డెసిషన్ ఫ్యామిలీ వైపా.. కెరియర్ వైపా తెలియాల్సి ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Kamal Haasan Mohan Lal: మెగాస్టార్‌తో లోక‌నాయ‌కుడు… అంతా సెట్ అయిన‌ట్టేనా?

Bigtv Digital

Janhvi Kapoor: NTR 30లో జాన్వీ క‌పూర్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Bigtv Digital

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుముూత

Bigtv Digital

Upcoming movies 2023 : దసరా నుంచి సంక్రాంతి వరకు థియేటర్లలో సందడే సందడి..

Bigtv Digital

Mega heroine Niharika : వెండితెరపై రీఎంట్రీకి మెగా హీరోయిన్ సిద్ధం..

Bigtv Digital

Allu Arjun: బన్నీతో మురుగదాస్‌ మూవీ.. ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ!

Bigtv Digital

Leave a Comment