BigTV English

Temba Bavuma : మాకు ఏడుపొక్కటే తక్కువ: సౌతాఫ్రికా కెప్టెన్

Temba Bavuma : మాకు ఏడుపొక్కటే తక్కువ: సౌతాఫ్రికా కెప్టెన్

Temba Bavuma : మెగా టోర్నీలో ఎంతో అద్భుతంగా ఆడి, ఎంతో కష్టపడి సెమీస్ వరకు వచ్చాం. సరిగ్గా ఆడాల్సిన నాకౌట్ మ్యాచ్ లో అంతర్జాతీయ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయామని సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఒక్కసారి బావోద్వేగానికి గురయ్యాడు. మాకు ఏడుపొక్కటే తక్కువని, చేతులతో ముఖం దాచుకున్నాడు. తర్వాత మాట్లాడుతూ…


24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాం. ఈ పరిస్థితుల్లో ఎవరూ కూడా పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేరని అన్నాడు.  కానీ మిల్లర్, క్లాసెన్ పోరాడారు. క్లాసెన్ అవుట్ కాకుండా ఉంటే మరో 30 పరుగులైనా వచ్చేవి. అప్పుడు ఆసిస్ ని నిలువరించే అవకాశం ఉండేదని తెలిపాడు.

మొదట్లో బ్యాటర్లు నలుగురు ఇలా అవుట్ అయితే, బౌలింగ్ కి వచ్చేసరికి మొదటి 10 ఓవర్లలో 70 పరుగులిచ్చి బౌలర్లు అలా చేశారు. వీరిద్దరూ ఇలా చేస్తే, మొత్తం టీమ్ అంతా కలిసి ఫీల్డింగ్ లో క్యాచ్ లు వదిలేశారని అన్నాడు. ఒక సమష్టి కృషితో అందరూ గెలుస్తారు..కానీ మేం ఓడిపోడానికి సమష్టిగా కృషి చేశామనే అర్థం వచ్చేలా చెప్పాడు.


అంతలో స్కోరు గేమ్ లో అందుకోవల్సిన క్యాచ్ లను నేలపాలు చేశారు. ఇక మాకు ఏడుపొక్కటే తక్కువ అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. తర్వాత మాట్లాడుతూ మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి, అంత ఒత్తిడిలో కూడా మ్యాచ్ పై ఆశలు కల్పించారు. మార్కరమ్, మహరాజ్ ఇద్దరూ ఆసిస్ పై ఒత్తిడి పెంచారని తెలిపాడు. కొయిట్జీ అద్భుత ప్రదర్శన చేశాడు. మా పేసర్లు విఫలమైనా చోట తను అరౌండ్ ద వికెట్ బాల్స్ వేసి వికెట్లు రప్పించాడని తెలిపాడు.

క్వింటన్ డికాక్ కి ప్రపంచకప్ గెలిచి అద్భుతమైన వీడ్కోలు ఇద్దామని అనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. కానీ సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో డికాక్ కూడా చరిత్రలో నిలిచిపోతాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒంటరి పోరాటం చేశాడు. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తను ఇంకొద్ది సేపున్నా, క్యాచ్ లు పట్టుకున్నా ఆట మరోలా ఉండేదని కెప్టెన్ బవుమా అన్నమాట అక్షరాలా నిజం. చివరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు నష్టపోయి 47.2 ఓవర్లలో లక్ష్యం చేధించి, పడుతూ లేస్తూ ఫైనల్ లో అడుగుపెట్టింది.

Related News

Harbhajan- Sreesanth : హర్భజన్, శ్రీశాంత్ మధ్య పుల్ల పెట్టిన లలిత్ మోడీ.. 18 ఏళ్ల గాయాన్ని తెరపైకి తీసుకువచ్చి

ICC – Google : మహిళల క్రికెట్ కోసం రంగంలోకి గూగుల్… జై షాతో పెద్ద డీలింగే

T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!

Hyderabad Flyovers : మెట్రో పిల్లర్లకు టీమిండియా ప్లేయర్ల ఫోటోలు… ఎక్కడంటే

Asia Cup 2025: ఆసియా కప్ కంటే ముందే టీమిండియా ప్లేయర్లకు గంభీర్ అగ్నిపరీక్ష… సెప్టెంబర్ 5 నుంచి ఆట షురూ

Harshit Rana : గంభీర్ రాజకీయాలు.. వీడొక్కడికే అన్ని ఫార్మాట్ లో ఛాన్స్.. తోపు ఆటగాళ్లకు అన్యాయమే

Big Stories

×