BigTV English

Siddharth: సమంతతో సహా సిద్దార్థ్ ఎఫైర్స్.. అదితి ఎన్నో భార్యనో తెలుసా.. ?

Siddharth: సమంతతో సహా సిద్దార్థ్ ఎఫైర్స్.. అదితి ఎన్నో భార్యనో తెలుసా.. ?

Siddharth:  కొంతమందిని చూస్తే .. అసలు వీరికి వయస్సు పెరుగుతుందా.. తరుగుతుందా అని డౌట్ వస్తుంది. అలాంటి వారిలో హీరో సిద్దార్థ్  మొదటి వరుసలో ఉంటాడు.  45 ఏళ్ల  వయస్సులో కూడా   ఇంకా పాతికేళ్ళు  కూడా నిండని కుర్రాడిలా కనిపిస్తాడు.  సిద్దును చూసినా ప్రతిసారి అందరు ఇలానే అనుకుంటారు అని అనుకోవడంలో  ఎటువంటి అతిశయోక్తి లేదు.


మణిరత్నం దగ్గర  అసిస్టెంట్  గా  కెరీర్ మొదలుపెట్టిన సిద్దార్థ్ బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమానే శంకర్ దర్శకత్వంలో  చేయడం,  అది కాస్తా భారీ విజయాన్ని అందుకోవడంతో సిద్దు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, హిందీ అనే  తేడా లేకుండా ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక సినిమాల గురించి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో సిద్దు నడిపినన్ని ఎఫైర్స్ ఇంకెవరు నడపలేదనే చెప్పాలి. అసలు చాలామందికి సిద్దార్థ్ కు ఇప్పటివరకు పెళ్లి కాలేదని అనుకుంటూ ఉండడం విశేషం.   హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనతో సిద్దు వివాహం ఘనంగా  జరిగింది. 2003 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.  దాదాపు నాలుగేళ్లు   కూడా వీరు కలిసి  ఉండలేకపోయారు. 2007 లో వీరు  విడాకులు తీసుకున్నారు.  దానికి కారణం  సిద్దార్థ్  కు ఉన్న ఎఫైర్స్ అని కోలీవుడ్ లో టాక్.


ఇండస్ట్రీలో హీరోలకు ఎఫైర్స్ ఉండడం సాధారణమే. అయితే సిద్ధుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మందితో ఎఫైర్ ఉందని ఒక సీనియర్ డైరెక్టర్ మీడియా ముందే చెప్పుకురావడం గమనార్హం.  విడాకుల తరువాత బాలీవుడ్ బ్యూటీ సోహా ఆలీ ఖాన్ తో సిద్దార్థ్ ప్రేమాయణం మొదలుపెట్టాడు.  మీడియాలో వీరి ప్రేమాయణం గురించి అందరికి తెలుసు కూడా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈలోపే ఏమైందో ఏమో తెలియదు.. సిద్దు – సోహా విడిపోయారు.

ఇక బాలీవుడ్ ను వదిలి టాలీవుడ్ హీరోయిన్ పై కన్నేశాడు సిద్దు.   స్టార్ హీరోయిన్ సమంతతో సిద్దు ఎఫైర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్  అనే సినిమాలో కూడా నటించారు. బయట చాలా చోట్ల కెమెరా  కంటికి కూడా కనిపించారు. ఇక సిద్దు నిజ స్వరూపం తెలుసుకున్న సామ్.. అతడిని దూరం పెట్టింది. ఆ తరువాత అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సామ్ పెళ్లి రోజు సిద్దు చేసిన ట్వీట్  ఎంత  వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సిద్దు పెట్టిన దిష్టినో, ఏమో ఆ జంట కూడా నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడిపోయారు. ఇక  సామ్ తో ఆపకుండా సిద్దు.. తన  ఎఫైర్స్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. సామ్ తరువాత దీప సన్నిధి అనే  కోలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు. ఇది కూడా ఎక్కువ కాలం నిలువ లేదు. ఆ తరువాత శృతి హాసన్ ను ట్రై చేసాడని టాక్.. ఇలా  సిద్దు  లిస్ట్ చాలా పెద్దది. ఆ సమయంలోనే అతడి జీవితంలోకి అదితి రావు హైదరీ ప్రవేశించింది.

తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం  సినిమాలో సిద్దు – అదితి మొదటిసారి జంటగా నటించారు.  ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది. అదితికి కూడా ఇది రెండో పెళ్లి.  2009 లో సత్యదీప్ మిశ్రాను వివాహమాడిన ఈ చిన్నది.. కొన్ని విభేధాల వలన 2013 లో  భర్తకు విడాకులు ఇచ్చింది. ఇక వీరిద్దరూ..  ప్రస్తుతం కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. మరి వీరైనా కలకాలం సంతోషంగా ఉండాలని  అభిమానులు ఆశీర్వదిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×