BigTV English

Tollywood Heroines : 18 ఏళ్లలోపే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టాప్ 5 హీరోయిన్లు వీళ్లే..

Tollywood Heroines : 18 ఏళ్లలోపే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టాప్ 5 హీరోయిన్లు వీళ్లే..

Tollywood Heroines : తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఇండస్ట్రీ ఎంతో మందికి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లేలా చేస్తుంది. ఎన్నో వేల కుటుంబాలకు జీవనధారం అయ్యింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతుంది. అయితే ఇండస్ట్రీలోకి రావాలంటే కష్టం పడాలి. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక అదృష్టం, టాలెంట్ ఉంటే నెగ్గుకు రావడం చాలా సులువు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోకి అతి చిన్న వయస్సులోనే శ్రీదేవి గారి లాగా చాలామంది నటీమణులు చిన్న వయసులో ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా మన ముందుకు వచ్చారు. చాలా చిన్న వయసులో ఒంటరిగా వచ్చిన హీరోయిన్స్ సక్సెస్ కూడా సాధించారు. ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చక్రం తిప్పుతున్స టాప్ 5 హీరోయిన్లు ఎవరో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..


శ్రీదేవి.. 

స్వర్గీయ నటి అందాల తారా శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకుల అభిమానం పొందింది.ఆమె మళ్లీ పుడితే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు..


కృతి శెట్టి.. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయితే అమ్మడు అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఉప్పెన సినిమా ఇప్పుడు ఈమె వయసు 17 సంవత్సరాలు. ఆ సినిమా అయితే బాగా హీట్ అయింది గానీ ఆ తర్వాత సరైన హిట్ సినిమాలు ఈమె ఖాతాలో పడలేదు ఇప్పటికే హిట్ సినిమాలు కోసం ప్రయత్నాలు చేస్తుంది..

తమన్నా.. 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ లిస్టులో ఉండేది. మొదట్లో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్ సినిమాలు దూరమవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా గడుస్తుంది. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఈమె వయసు 15 సంవత్సరాలు.. తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలు అందరి సరసన జత కట్టింది.

హన్సిక మోత్వారీ.. 

హన్సిక.. ఈ పేరు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగు తో పాటు బాలీవుడ్ ఇతర భాషల్లో కూడా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దేశముదురు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. దేశముదురు సినిమా చేసే టైంలో ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆ సినిమా అనుకున్నంత ని అందుకోకపోయినా అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో కన్నా వేరే భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తుంది.

చార్మి కౌర్.. 

చార్మింగ్ బ్యూటీ ఛార్మీకౌర్ గురించి అందరికీ తెలుసు. పంజాబీ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో అప్పట్లో చాలా బిజీగా ఉండేది. ఆమె అందానికి ముద్దులైనా దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయించాలని క్యూ కట్టే వారు. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఈమె వయసు 15 సంవత్సరాలు. నీ తోడు కావాలి అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత పౌర్ణమి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తు బిజీగా ఉంది..

వీళ్లే కాదు వీళ్ళతో పాటి చాలామంది హీరోయిన్లు అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసి 10 సినిమాల్లో నటించారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×