E-Paper
Advertisement

OTT Movie : ప్రేమించిన ప్రియుడే మృగంలా మారితే… శాపానికి గురైన ఊరు శవాల దిబ్బగా మారి…

OTT Movie : ప్రేమించిన ప్రియుడే మృగంలా మారితే… శాపానికి గురైన ఊరు శవాల దిబ్బగా మారి…
Advertisement

OTT Movie : తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రిమింగ్ అవుతుంది. చిన్న సినిమానే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడవిలో జీవించే ఒక అమాయకపు అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

నీస్ట్రీమ్ X (Neestreem X) లో

Advertisement

2019 లో వచ్చిన ఈ తమిళ్ మూవీ పేరు ‘మాదతి‘ (Maadathy). ఈ మూవీకి లీనా మణిమేకలై దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అజ్మీనా కాసిమ్, ప్యాట్రిక్ రాజ్, సెమ్మలర్ అన్నం, అరుల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సానుకూల క్రిటికల్ రెస్పాన్స్‌ను పొంది, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019లో ప్రీమియర్ రిలీజ్ చేయబడింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నీస్ట్రీమ్ X (Neestreem X) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఇద్దరు భార్యాభర్తలు ఒక అడవి మార్గం ద్వారా మాదతి అనే టెంపుల్ కి ప్రయాణిస్తుంటారు. అక్కడ వీళ్ళకి గుడిసెతో వేసిన ఒక ఇల్లు కనపడుతుంది. అందులో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ గుడిసె నిండా ఒక విచిత్రమైన ఫోటోలు ఉంటాయి. అవి ఏమిటని అక్కడికి వచ్చిన మహిళ అడుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. యశోన అనే ఒక అమ్మాయి యుక్త వయసుకు రావడంతో తల్లి, తండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అడవిలో యశోన సరదాగా తిరుగుతూ ఉండటంతో, తల్లి యశోనని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. తక్కువ కులంలో పుట్టడంతో వీళ్ళు ఊరికి దూరంగానే ఉంటారు. యశోనకి బయట వ్యక్తులతో పరిచయం ఉండదు. వీళ్ళు ఉన్నచోట ఒక చెరువు ఉండటంతో, పనీర్ అనే వ్యక్తి స్నానానికి వస్తూ ఉంటాడు. అతన్ని దూరంగానే చూస్తూ ఇష్టపడుతుంది యశోన. ఒకరోజు ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడికి వెళుతుంది. ఆ ప్రాంతంలో ఒక జాతర జరుగుతూ ఉంటుంది. పనీర్ తన ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవిస్తూ ఉంటాడు. దూరం నుంచి ఇది గమనిస్తూ ఉంటుంది యశోన.

అక్కడ ఉన్న పనీర్ ఫ్రెండ్స్ ఆమెపై అఘాయిత్యం చేస్తారు. పనీర్ కూడా ఆమెపై మృగంలా ప్రవర్తిస్తాడు. ఇది జరిగిన మరుసటి రోజు యశోన చనిపోయి ఉంటుంది. ఆ ఊరి మనుషులను యశోనా తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు. కోపగించుకున్న ఊరి ప్రజలు, వీళ్లను అక్కడి నుంచి తరిమేస్తారు. యశోన తల్లిదండ్రులు వాళ్లను శపించి అక్కడినుంచి వెళ్లిపోతారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ ఊరికి వరద వచ్చి ఊరికి ఊరు నాశనం అయిపోతుంది. మిగిలిన వాళ్ళు గుడ్డివాళ్ళుగా మారుతారు. అయితే గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ కథ అక్కడికి వచ్చిన మహిళకి చెబుతాడు చిన్న పిల్లవాడు. అక్కడినుంచి మహిళకి తన భర్త కనిపించకుండా పోతాడు. మరోవైపు ఆ గుడిసె కూడా కనిపించకుండా పోతుంది. అలా ఎందుకుజరిగిందో ‘మాదతి’ (Maadathy) మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×