E-Paper
Advertisement

saiDharam Tej : మాట ప‌డిపోయి బాధ‌ప‌డుతుంటే..మందేశావా అని జోకులేశారు

saiDharam Tej : మాట ప‌డిపోయి బాధ‌ప‌డుతుంటే..మందేశావా అని జోకులేశారు
Advertisement
saiDharam Tej

saiDharam Tej : మెగా క్యాంప్‌కు చెందిన యువ హీరోల్లో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. రెండేళ్ల ముందు అనుకోకుండా జ‌రిగిన బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా సాయితేజ్ ఆరోగ్యం కాస్త క్రిటిక‌ల్‌గానే మారింది. అయితే త‌ను మాన‌సిక స్థైర్యంతో తిరిగి మామూలు మ‌నిషి అయ్యారు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ త‌ర్వాత త‌న‌కు తాను ఏమ‌నిపించింద‌నే విష‌యంపై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ‘‘యాక్సిడెంట్ త‌ర్వాత మాట ఎంత విలువైన‌దో తెలుసుకున్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి నేను చాట‌ర్ బాక్స్‌. ఎక్కువ మాట్లాడుతుండ‌టం వ‌ల్ల క్లాస్ బ‌య‌టే ఎక్కువ‌గా నిల‌బ‌డేవాడిని. రిప‌బ్లిక్ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ని చెప్పేసేవాడిని. అలాంటి నాకు యాక్సిడెంట్ కాగానే మాట పోయింది. అర పేజీ డైలాగ్ కూడా చెప్ప‌లేక‌పోయాను.

యాక్సిడెంట్ స‌మయంలో మాట పోయింది. ఆ మాట తిరిగి రావ‌టానిఇ ఎంత క‌ష్ట‌ప‌డ్డానో నాకే తెలుసు. ఆ మాట‌లు వ‌చ్చినప్పుడు మాట‌లు దొర్లిపోయేవి. ఆ స‌యంలో నా కుటుంబ స‌భ్యులు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇక షూటింగ్ స‌మ‌యంలో అయితే యూనిట్ మెంబ‌ర్స్ ఎంతో స‌పోర్ట్ చేశారు. అంద‌రూ ఎంతో ఓపిక‌గా నేను చెప్పేది వినేవారు. అర్థం కాక‌పోతే మెల్ల‌గా మ‌ళ్లీ చెప్ప‌మ‌నేవారు. నా గురువుగారైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారైతే షూటింగ్ స‌మ‌యంలో మీమ్ చేస్తే చాలు అని చెప్పారు. బ‌య‌ట వాళ్ల‌తో మాట్లాడేట‌ప్పుడు మాట స‌రిగ్గా మాట్లాడ‌క‌పోవ‌టం వ‌ల్ల‌.. ఏం బాబు ఓ నైన్టీ వేసుకొచ్చావా ఏంది? అని జోకులు వేసేవాళ్లు. మాట తిరిగి రావ‌టానికి చాలా బాధ‌ప‌డ్డాను.

Advertisement

అయితే విమ‌ర్శ‌లు, నాపై వేసే జోకుల గురించి నేను ప‌ట్టించుకోలేదు. నేను ఎలా డెవ‌ల‌ప్ కావాల‌నే విష‌యాల‌ను గురించి ఎక్కువ‌గా ఆలోచించేవాడిని’’ అన్నారు . ఏప్రిల్ 21న సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ విరూపాక్ష సినిమా రిలీజ్ అవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×