BigTV English
Advertisement

MI Vs RCB : విరాట్ , డుప్లెసిస్ విధ్వంసం.. ముంబై చిత్తు..

MI Vs RCB : విరాట్ , డుప్లెసిస్ విధ్వంసం.. ముంబై చిత్తు..

MI Vs RCB : ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెలరేగిపోయింది. ముంబై జట్టును చిత్తు చేసింది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి (82 నాటౌట్, 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), డుప్లెసిస్ (73, 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) తొలి వికెట్ కు 148 పరుగులు జోడించారు.వీరిద్దరు ముంబై బౌలర్లను ఆటాడుకున్నారు. ఎడపెడా సిక్సులు , ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. డుప్లెసిస్ , దినేష్ కార్తీక్ (0) వెంటవెంటనే అవుట్ అయినా.. ఆ తర్వాత దిగిన మ్యాక్స్ వెల్ 3 బంతుల్లో 2 సిక్సులతో 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో బెంగళూరు జట్టు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్లలో అరంగ్రేటం బౌలర్ అర్షద్ ఖాన్ , కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు.


అంతకుముందు టాస్ గెలిచి బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు పవర్ ప్లే ముగియముందే 20 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ (10), కామోరూన్ గ్రీన్ (5), రోహిత్ శర్మ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ 10 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాసపర్చాడు. సూర్యకుమార్ యాదవ్ (15) కాసేపు క్రీజులో నిలబడినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో 48 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయింది.

గత సీజన్ లో అదరగొట్టిన తెలుగు కుర్రోడు తిలక్ వర్మ అద్బుత పోరాటం చేశాడు. అరంగ్రేటం ఆటగాడు నిహల్ వదెరా ( 21, 13 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సులు) తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిహల్, టిమ్ డేవిడ్ (4) , హృతిక్ సోకెన్ (5) వికెట్లు వెంటవెంటనే పడటంతో ముంబై 17.1 ఓవర్లలో 123 పరుగులు ఏడు వికెట్లు కోల్పోయింది. స్కోర్ 150 దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ చివరి 3 ఓవర్లలో తిలక్ వర్మ ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో చివరి 17 బంతుల్లో ముంబై 48 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 84 నాటౌట్, 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు ) అజేయంగా నిలిచాడు. అర్షద్ ఖాన్ ( 15 నాటౌట్, 9 బంతుల్లో 1 సిక్సు) చక్కటి సహకారం అందించాడు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.


ప్రత్యర్థి ముందు మంచి టార్గెట్ నే ఉంచినా బౌలర్లు పూర్తిగా విఫలంకావడంతో ముంబై చిత్తుగా ఓడింది. బ్యాట్ తో విధ్వంసం సృష్టించి మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసిన కెప్టెన్ డుప్లెసిస్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇప్పటి వరకు ఐపీఎల్ 2023 సీజన్ లో అన్ని జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. గుజరాత్, పంజాబ్, లక్నో, రాజస్థాన్ , బెంగళూరు జట్లు శుభారంభం చేశాయి. చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై జట్లు ఓటమిని చవిచూశాయి.

Related News

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

PM MODI: వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేశారంటే ?

IND VS AUS, 4th T20: నేడే 4వ టీ20..టీమిండియాకు అగ్ని ప‌రీక్షే..గిల్ వేటు, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్ !

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Big Stories

×