E-Paper
Advertisement

OTT Movies: ఈవారం మంచి మంచి సినిమాలు.. ఓటీటీలో సమ్మర్ స్పెషల్స్..

OTT Movies: ఈవారం మంచి మంచి సినిమాలు.. ఓటీటీలో సమ్మర్ స్పెషల్స్..
Advertisement
ott releases

OTT Movies: సమ్మర్ ఎండ్ అవుతోంది. ఓటీటీలో వినోదాల మజా పెరిగిపోతోంది. అసలే రోహిణీ కార్తె. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే, ఎంచక్కా హౌజ్ అరెస్ట్ అయి.. మీకు కావాల్సిన సినిమా చూసుకోవచ్చు. పాతవే మళ్లీ మళ్లీ చూడాల్సిన పని లేకుండా.. ఈవారం ఏకంగా 25 సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. ఇంకేం ఫుల్‌టూ టైంపాస్…

‘బూ’ (BOO). హారర్‌ మూవీ. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. విశ్వక్‌సేన్ హీరో. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. క్రేజీ కాంబినేషన్ కదూ. ఇంకా మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ తదితరులు యాక్ట్ చేశారు. దర్శకత్వం విజయ్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. జియో సినిమాలో మే 27 నుంచి ‘బూ’ స్ట్రీమింగ్‌.

Advertisement

పుష్పలో అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ గుర్తున్నాడుగా. అతనే హీరో. అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి. కొత్త డైరెక్టర్ అభినవ్.. ‘సత్తిగాని రెండెకరాలు’ టైటిల్‌తో సినిమా తీసి నేరుగా ‘ఆహా’(aha)లో రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం నుంచే చూడొచ్చు.

సిటడెల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ కూడా ఈ వారమే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రానుంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడన్‌ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ లాస్ట్ ఎపిసోడ్ మే 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

సల్మాన్‌ఖాన్‌, పూజా హెగ్డే, వెంకటేశ్‌లు నటించిన హిందీ మూవీ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’. థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. ఇది తమిళ్ సినిమా ‘వీరమ్‌’కు రీమేక్‌. మే 26 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.

వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ‘భేదియా’. తెలుగులో ‘తోడేలు’. జియో సినిమాలో మే 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈవారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే:

నెట్‌ఫ్లిక్స్‌:
దసరా (హిందీ)
చోటా భీమ్‌ (హిందీ) సిరీస్‌-18
బీడ్‌ (హిందీ)
ఆపరేషన్‌ మేఫెయిర్‌ (హిందీ)
బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌)
విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్)
మదర్స్‌ డే (హాలీవుడ్‌)
ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌)
బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (జర్మన్‌)
టిన్‌ అండ్‌ టీనా (స్పానిష్‌)
టర్న్‌ ఆఫ్‌ ది టైడ్‌ (పోర్చుగీస్‌)

అమెజాన్‌ ప్రైమ్‌:
సిటడెల్‌
మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ)
‘పంచువమ్‌ అద్భుత విళక్కుమ్‌’(మలయాళం/తెలుగు)

ఆహా:
సత్తిగాని రెండెకరాలు
గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3)

జియో సినిమా:
బూ
తోడేలు
థగ్స్‌ (తెలుగు/తమిళ్‌/హిందీ)
చిత్రకూట్‌ (హిందీ)
క్రాక్‌ డౌన్‌ (వెబ్‌సిరీస్-సీజన్‌2)

జీ5:
విడుదల: పార్ట్‌-1 (తెలుగు)
కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌
సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (ఒరిజినల్‌ మూవీ)

డిస్నీ+హాట్‌స్టార్‌:
అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌)
సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌-3)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×