Big Stories

Facial recognition technology : మొహాలను గుర్తుపట్టే టెక్నాలజీతో వాతావరణ మార్పులు గుర్తింపు..

Facial recognition technology : ఒక టెక్నాలజీ అనేది ఒక విషయం కోసం ఉపయోగించడం కోసం శాస్త్రవేత్తలు తయారు చేస్తుంటారు. కానీ వారికి కూడా తెలియని విషయం ఏంటంటే.. ఆ టెక్నాలజీ అనేది ఆ ఒక్క విషయం కోసమే కాకుండా మరెన్నో ఇతర విషయాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో టెక్నాలజీలు అనేకానేక విషయాలకు ఉపయోగపడుతున్నాయి. అలాంటి ఒక టెక్నాలజీనే వాతావరణం కనిపెట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

మనుషుల మొహాలను గుర్తుపట్టే టెక్నాలజీతో వాతావరణాన్ని కూడా కనిపెట్టవచ్చని పలువురు శాస్త్రవేత్తల టీమ్ కనిపెట్టింది. గూగుల్ ఫేస్‌నెట్ నుండి వారికి ఈ ఐడియా వచ్చిందని బయటపెట్టారు. గూగుల్ ఫేస్‌నెల్‌లో మొహాలను డేటాబేస్‌లో ఉన్న మొహాలతో పోల్చి చూస్తారు. అదే విధంగా వాతావరణాన్ని కనిపెట్టే టెక్నాలజీలో ప్రస్తుతం వాతావరణాన్ని హిస్టరీలో ఉన్న సూచనలతో పోల్చి చూస్తారు. ఈ టెక్నాలజీని స్టడీ చేయడం కోసం వారు ఒక ఆల్గరిథంను కూడా పరీక్షించి చూశారు.

- Advertisement -

ఈరోజుల్లో వాతావరణ మార్పులను శాస్త్రవేత్తలు సైతం అంచనా వేయలేకపోతున్నారు. వాతావరణం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో వారికి కూడా అర్థం కాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న వాతావరణ మార్పులు.. ఇంతకు ముందు కూడా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 2017 నుండి 2019 మధ్యలో పెన్సిల్వేనియాలో ఈ టెక్నాలజీపై పరిశోధనలు జరిగి అవి సక్సెస్ కూడా అయ్యాయి. దీంతో ఈ టెక్నాలజీ ద్వారా వాతావరణ మార్పులను కరెక్ట్‌గా స్టడీ చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

ఇప్పటికే ఇలాంటి పద్ధతిలో వాతావరణ మార్పులను కనిపెట్టడం కోసం ఆనలాగ్ ఫోర్‌క్యాస్టింగ్ అనే ప్రక్రియ అందుబాటులో ఉంది. గత కొన్నేళ్లుగా ఈ పద్ధతిలోనే ఇప్పుడు ఉన్న వాతావరణం.. భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు గురవుతుంది అని తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆనలాగ్ ఫోర్‌క్యాస్టింగ్‌ను మించి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో వచ్చే విపత్తులను కూడా ముందస్తుగా కనిపెట్టవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News