Big Stories

Tillu Square Review: పర్ఫెక్ట్ సీక్వెల్.. మరోసారి హిట్ కొట్టిన డీజే టిల్లు

- Advertisement -

Tillu Square: ఈ మధ్యకాలంలో సినిమాలకు సీక్వెల్స్ లేకుండా ఉండడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. అయితే ఆ సీక్వెల్స్ లో కొన్నే విజయవంతం అవుతున్నాయి. 2022 లో డీజే టిల్లు పేరుతో ఒక సినిమా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ, నేహశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సిద్దును డీజే టిల్లుగా మార్చేసింది. నేహా శెట్టి పేరు పూర్తిగా రాధికాగా మార్చేసిన సినిమా డీజే తిళ్లు. ఇక దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. ఈసారి ఈ సినిమాకు డైరెక్టర్ మారాడు.. రాధికా కూడా మారింది. విమల్ కృష్ణ ప్లేస్ లో మల్లిక్ రామ్ వచ్చాడు. నేహా ప్లేస్ లో అనుపమ వచ్చి చేరింది. ఇప్పటివరకు అనుపమ ఇలాంటి గ్లామర్ రోల్ చేయలేదు. దీంతో అనుపమనే ఈ సినిమాకు మైనస్ అవుతుంది అనుకున్నారు. కానీ సినిమా చూసాక ది పర్ఫెక్ట్ ఛాయిస్ ఆనక మానదు. ఇక ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

కథ విషయానికొస్తే.. డీజే టిల్లు చివర్లో టిల్లు.. రాధికను జైల్లో కలిసి.. ఒక తెల్ల పిల్లతో వెళ్లిపోవడం చూపించారు. ఇక టిల్లు స్క్వేర్ అక్కడి నుంచే మొదలవుతుంది. రాధికా చేసిన మోసాన్ని మర్చిపోతూ.. టిల్లు.. తన మ్యూజిక్ తో ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు.  అలా ఒకసారి పబ్ లో లిల్లీ(అనుపమ) కనిపిస్తుంది. రాధికా తరువాత ఏ అమ్మాయిని అంతగా చూడని టిల్లు.. లిల్లీని చూడగానే పడిపోతాడు. ఇక లిల్లీ కూడా టిల్లుకు పడిపోతుంది. అలా కలిసి న మొదటిరోజే వారు ఒక్కటవ్వుతారు. ఉదయమే లేచి చూసిన టిల్లుకు లిల్లీ కనిపించదు. వెతికి వెతికి అలసిపోయిన టిల్లుకు నెల తరువాత లిల్లీ ఒక హాస్పిటల్ లో కనిపించి తాను ప్రెగ్నెంట్ అనిచెప్తుంది . మొదట టిల్లు నమ్మకపోయినా.. తరువాత దానికి కారణం తనే అని లిల్లీని పెళ్లి చేసుకుంటాను అంటదు. ఇక రెండు కుటుంబాలు కూడా ఈ పెళ్ళికి అంగీకరించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీ.. టిల్లుకు షాక్ ల మీద షాకులు ఇస్తుంది. మరోసారి టిల్లు అమ్మాయి చేతిలో మోసపోయాడు అని తెలుసుకుంటాడు. అసలు లిల్లీ ఎవరు.. ? ఎందుకు తన జీవితంతో ఆడుకుంది.. ? లిల్లీకి, మాఫియాకు ఉన్న సంబంధం ఏంటి.. ? మధ్యలో రాధికా ఎందుకు వచ్చింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక కథ విశ్లేషణకు వస్తే.. సినిమా మొత్తం సిద్దు తన మార్క్ పంచ్ లతో అదరగొట్టేశాడు. థియేటర్ లో ఉన్నంతసేపు నవ్వకుండా ఉండలేరు. ముఖ్యంగా అనుపమ అందం మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి.  ట్రైలర్ లో అనుపమను చూసి కేవలం గ్లామర్ కు మాత్రమే పనికివస్తుంది అనుకున్నారు కానీ, సినిమా మొత్తం లిల్లీ పాత్ర మీదనే నడుస్తోంది. డైరెక్టర్ మారిన కూడా సినిమాపై పట్టు తగ్గనివ్వలేదు. ఎలాంటి ఎలివేషన్స్  కు తావు ఇవ్వకుండా టిల్లు కేవలం తనకు తాను బిల్డప్ లు ఇచ్చే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. ఎక్కడా లాగ్ అనిపించే సన్నివేశాలు లేకపోవడం ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో  పర్ఫెక్ట్ సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను తీర్చిదిద్దారు.

నటీనటుల విషయానికొస్తే..  టిల్లు అంటే సిద్దు.. సిద్దు అంటే టిల్లు అని చెప్పొచ్చు. ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. అమాయకంగా ఉంటూనే.. ప్రమాదం వచ్చిన ప్రతిసారి ఏదోవిధంగా తప్పించుకోవడానికి తెలివేని వాడే పాత్రలో సిద్దు జీవించేసాడు. ఇక లిల్లీగా అనుపమ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. చాలా కాలం తరువాత అనుపమ అటు గ్లామర్ ను, ఇటు నటనను బ్యాలెన్స్ చేసి చూపించింది.

ఇక  టిల్లు తండ్రిగా చేసిన మురళీధర్ కు మంచి మార్కులు పడ్డాయి. డీజే టిల్లులో కూడా తండ్రికొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దాన్నే సీక్వెల్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇక అతిధి పాత్రలో మెరిసిన రాధికా(నేహా శెట్టి) హైలైట్ అని చెప్పాలి. ఆమె ఎంట్రీకి స్పెషల్ సాంగ్.. ఇక రాధికను చూడగానే థియేటర్ లో ఒకటే అరుపులు.  మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. రామ్ మిరియాల , అచ్చు రాజమణి  ఇచ్చి పడేశారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. స్టార్ బాయ్ సిద్దు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. డీజే టిల్లుకు పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ఛాయిస్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News