Big Stories

Sunita Kejriwal Started WhatsApp Campaign: కేజ్రీవాల్‌‌కు మద్దతుగా ప్రచారం.. వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన సతీమణి!

Sunita Kejriwal about arvind kejriwal
Sunita Kejriwal

Sunita Kejriwal about Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజల మద్దతు కోరారు. జైలులో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఓ వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేశారు. ప్రజలు ఆ నెంబర్‌కు ఎటువంటి మెస్సేజ్‌లు అయినా చేయవచ్చని సునీతా తెలిపారు.

- Advertisement -

ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రజలు మద్దకు ఇవ్వాలంటూ ఆయన భార్య ఓ వాట్సాప్ నెంబర్ షేర్ చేశారు. 8297324624 వాట్సాప్ నెంబర్‌కు మీ దీవెనలు, ప్రార్థనలు మెస్సేజ్ చేయాలని కోరారు. ఎవరు ఎటువంటి మెస్సేజ్‌లు అయినా ఆ వాట్సాప్ నెంబర్‌కు చేయవచ్చని సునీతా కేజ్రీవాల్ వెల్లడించారు.

- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని మరో నాలుగు రోజులపాటు కోర్టు పొడిగించిన విషయం తెలిసింది. అయితే జైలులో తన భర్తకు ప్రజలు మద్దతు ఇవ్వాలంటూ ఆయన భార్త శుక్రవారం ఓ వీడియో ద్వారా కోరారు. ఆమ్ ఆద్మీ నేత కోసం ప్రజలు మెస్సేజ్‌లు చేయాలని సూచించారు. కేజ్రీవాల్‌ను ఆశీర్వదించాలని తాము ప్రత్యేక డ్రైవ్ పెడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఈ వాట్సాప్ నెంబర్ వెల్లడించామన్నారు.

Also Read: CM Kejriwal’s phone: కేజ్రీవాల్ ఫోన్ చుట్టూ దర్యాప్తు.. అందులో పోల్ స్ట్రాటజీ ఉందా?

మీరు పంపిన మెస్సేజ్‌లు అన్ని తాను కేజ్రీవాల్‌కు చేరవేస్తానని తెలిపారు. మీరు ఆయనపై చూపించే ప్రేమ, అభిమానాలతో ఆయన ధైర్యంగా ఉంటారన్నారు. తన భర్త నిజమైన దేశ భక్తుడని ఆమె పేర్కొన్నారు. అలాంటి ఆయన్ను ప్రస్తుతం నియంత శక్తులు అణిచివేస్తున్నాయని.. ఈ సమయంలో ప్రజల ఆయనకు మద్దతుగా నిలవడం చాలా అవసరం అని సునీతా కేజ్రీవాల్ వెల్లడించారు.

అయితే మార్చి 21న లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతితో కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. తమకు విచారించడానికి మరింత గడువు కావాలని ఈడీ అధికారులు కోరగా.. కోర్టు ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News