E-Paper
Advertisement

Tirthanand Rao Suicide : ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం..

Tirthanand Rao Suicide  : ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం..
Advertisement
Tirthanand Rao Suicide

Tirthanand Rao Suicide : బాలీవుడ్ నటీనటుల ఆత్మహత్యలు అనేవి చాలా అరుదుగా జరుగుతాయి. కానీ అలా జరిగినప్పుడు అవి ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తాయి. తాజాగా ఒక బాలీవుడ్ నటుడు ఏకంగా ఫేస్‌బుక్ లైవ్‌లోనే ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫేస్‌బుక్ లైవ్‌ను ఆన్ చేసి తను విషం తాగడం తన ఫాలోవర్స్ అంతా చూశారు.

Advertisement

కపిల్ శర్మతో కలిసి ‘కామెడీ సర్కస్ కే అజూబ్’ అనే షోలో నటించాడు తీర్థానంద రావు. ఈ షోతో తనకు మంచి గుర్తింపే లభించింది. తాజాగా తీర్థానంద రావు తన లివిన్ పార్ట్‌నర్ తనను మోసం చేసిందని, బ్లాక్‌మెయిల్ చేస్తుందని చెప్తూ ఫేస్‌బుక్ లైవ్‌లోనే విషం తాగేశాడు. ఇది విషమా కాదా అని ఆ లైవ్ చూసిన వారు నిర్ధారించకపోయినా.. అది కీటకాలను చంపే మందు అని వారు గమనించారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నాన్ని చూసిన తన స్నేహితులు.. వెంటనే అతడి ఇంటికి వచ్చి.. తనను ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు పోలీసులకు కూడా వారు సమాచారం అందించారు. ఫేస్‌బుక్ లైవ్‌లో తాను ఒక అమ్మాయితో అక్టోబర్ నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, తన ఆత్మహత్యకు ఆ అమ్మాయే కారణమని వెల్లడించాడు.

Advertisement

ఆ అమ్మాయి తన మీద పోలీసు కేసు పెట్టి, తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతుందని తీర్థానంద రావు లైవ్‌లో చెప్పాడు. అంతే కాకుండా తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏమీ బాలేదన్నాడు. తాను ఆర్థికంగా, మానసికంగా బలహీనపడడానికి పూర్తి కారణం ఆ అమ్మాయే అని తెలిపాడు. ఆసుపత్రికి తరలించిన తర్వాత తీర్థానంద రావు పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు బయటపెట్టారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×