BigTV English

Adah Sharma news : సూపర్‌హీరో పాత్రలో ‘కేరళ స్టోరీ’ భామ..

Adah Sharma news : సూపర్‌హీరో పాత్రలో ‘కేరళ స్టోరీ’ భామ..

adah-sharma-news


Adah Sharma News : ఒకప్పుడు హీరోలు ఫైట్ చేస్తేనే, భారీ భారీ డైలాగులు చెప్తూ తమ యాక్షన్‌ను కనబరిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడేవారు. కానీ రోజులు మారాయి. హీరోయిన్లు ఫైట్లు చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే చాలామంది భామలు ఇలాంటి కథలను ఓకే చేయడానికి వెనకాడడం లేదు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.

‘ది కేరళ స్టోరీ’.. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీ అలాంటిది. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. రెండు వర్గాల మధ్య మాత్రమే కాదు.. రాష్ట్రాల మధ్యలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో నటించిన అదా శర్మ తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా బెదిరింపులకు కూడా గురయ్యింది. ఈ సినిమాతో ఫార్మ్ కోల్పోయిన అదా.. మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చింది.


ఇప్పటివరకు పలు సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా హీరోయిన్‌గా నటించి మెప్పించిన అదా శర్మ.. ఇప్పుడు ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా ఒక సూపర్‌హీరో పాత్రలో కనిపించనుందట. కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న అదా.. ఎక్కువగా ఫ్యాన్స్‌తో, మీడియాతో ఇంటరాక్ట్ అవుతోంది. అదే సమయంలో తను ఈ సూపర్‌హీరో ప్రాజెక్ట్ గురించి స్వయంగా ప్రకటించింది. కానీ దీని గురించి మరిన్ని వివరాలు బయటపెట్టడానికి తను సిద్ధంగా లేదు.

తనకెప్పుడూ సూపర్ హీరోలు అంటే చాలా ఇష్టం ఉండేదని, తాను కూడా ఇప్పుడు అలాంటి ఒక పాత్రలో నటిస్తున్నానని అదా బయటపెట్టింది. కానీ ఇప్పుడు దీని గురించి ఎక్కువగా వివరాలు బయటపెట్టలేనని చెప్పింది. యాక్షన్ సినిమాల్లో నటించడం తనకెంతో ఇష్టమని తెలిపింది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ఈ సినిమా గురించి తానేమీ చెప్పనని అంటోంది అదా. ఇప్పటివరకు తన కెరీర్‌లో వివిధ భిన్నమైన పాత్రలు చేసినందుకు ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది అదా శర్మ.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×