E-Paper
Advertisement

Kartikeya – Bhaje Vaayu Vegam: బ్యాట్‌తో కార్తికేయ పరుగులు.. కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రివీల్

Kartikeya – Bhaje Vaayu Vegam: బ్యాట్‌తో కార్తికేయ పరుగులు.. కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రివీల్
Advertisement

Kartikeya: టాలీవుడ్ నటుడు కార్తికేయ ‘ఆర్‌ఎక్స్ 100’తో ఫల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆ సినిమా లాంటి హిట్ మరొకటి పడలేదు. ఇందులో భాగంగానే వరుసపెట్టి సినిమాలు తీశాడు. అయినా బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో హిట్లు సాధించలేక పోయాడు. ఇప్పుడు మరొక మూవీతో తన లక్ పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పుడు కార్తికేయ తన కెరీర్‌లో 8వ మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే నిన్న ఈ మూవీ నుంచి సరికొత్త అప్డేట్ వస్తుందంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను వదిలారు. ఈ చిత్రం టైటిల్‌ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. కాగా ఈ చిత్రానికి గానూ ‘భజే వాయు వేగం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కార్తికేయ ఏదో ఫైట్ సీన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాట్ పట్టుకొని పరుగులు పెడుతున్న లుక్.. బ్యాక్ డ్రాప్‌లో కారు, డబ్బులు కనిపిస్తున్నాయి.

Also Read: బ్రేకింగ్: ‘రామాయణం’ మూవీకి నిర్మాతగా రాఖీభాయ్ యష్.. నమిత్ మల్హాత్రాతో కలిసి..

Advertisement

ఈ పోస్టర్‌తో కార్తికేయ ఈ సారి మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సాలిడ్ కంటెంట్‌తో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కార్తికేయకు జోడీగా మలయాళ భామ ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హ్యాపీడేట్ ఫేం రాహుల్ టైసన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నాడు. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×