BigTV English

Ramayanam: బ్రేకింగ్: ‘రామాయణం’ మూవీకి నిర్మాతగా రాఖీభాయ్ యష్.. నమిత్ మల్హోత్రాతో కలిసి..

Ramayanam: బ్రేకింగ్: ‘రామాయణం’ మూవీకి నిర్మాతగా రాఖీభాయ్ యష్.. నమిత్ మల్హోత్రాతో కలిసి..

Ramayanam: ప్రస్తుతం అందరి చూపు బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న ‘రామాయణం’ సినిమా మీదే ఉంది. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే ‘ఆదిపురుష్’తో దర్శకుడు ఓం రౌత్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సారి అలా జరగకుండా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ఈ రామాయణం సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి.. రావణాసురుడి పాత్రలో కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి యష్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలతో తెరకెక్కుతున్న ‘రామాయణం’కి నిర్మాత కూడా యష్ అని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే రాకీభాయ్ యష్, నమిత్ మల్హోత్రా కలిసి ఈ చిత్రాన్ని కోట్లాది బడ్జెట్‌తో నిర్మించనున్నారు. నటుడు కమ్ నిర్మాత యష్‌కి సంబంధించిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రాకి సంబంధించిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి ప్రేక్షకుల కోసం భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ కోసం ఒక్కటయ్యారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Also Read: ఓటీటీలోకి వచ్చేసిన గామి.. ప్రేమలు.. మరో క్రేజీ మూవీ కూడా..

ఇందులో భాగంగా మల్హోత్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘రామాయణం’ వంటి అపురూపమైన కథకు న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి తగిన శ్రద్ధతో గౌరవప్రదంగా వ్యవహరిస్తాను. ఈ కథను నేను ఎంతగానో గౌరవిస్తాను. దానిని మనమందరం చాలా గొప్పగా భావిస్తాము. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి నేను సంతోషిస్తున్నాను. రామాయణంలోని దృశ్యకావ్యాన్ని తెరపైకి తీసుకొస్తున్నాం’’ అంటూ అతడు తెలిపాడు.

అయితే దీనిపై యష్ కూడా స్పందించాడు. ‘‘భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించే విధంగా తీయాలనేది నా చిరకాల కోరిక. దాని కోసం నేను ఒక అత్యత్తమ విఎఫ్ఎక్స్ స్టూడియోతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలోని ఇతర విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు రామాయణం టాపిక్ వచ్చింది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే చిత్రమిది. ఈ ఎపిక్ మూవీ రూపుదిద్దుకుంటోంది. ప్రపంచానికి ఆ అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము’’ అని అతను చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా నమిత్ మల్హోత్రా యాజమాన్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రస్తుతం మూడు సినిమాల నిర్మాణంలో పాల్గొంటోంది. అందులో రామాయణం ఒకటి. అలాగే యష్‌కి మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు ‘రాక్షసుడు మనసు’ క్రియేషన్స్ కూడా ‘టాక్సిక్’ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాయి. ఇదే బ్యానర్‌లో యష్ ‘రామాయణం’ చిత్రానికి కూడా పెట్టుబడి పెడుతున్నారు.

Also Read: రామ్ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ.. కారణం ఇదే..!

కాగా ఇప్పటికే ఈ మూవీ కోసం ఇద్దరు ఆస్కార్ అవార్డు విన్నర్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోగా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం జర్మన్ ఫిల్మ్ స్కోర్ కంపోజర్ హన్స్ ఫ్లోరియన్ జిమ్మెర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×