BigTV English

Tollywood: ప్రముఖ నటికి హత్య బెదిరింపులు.. అసలేమైందంటే..?

Tollywood: ప్రముఖ నటికి హత్య బెదిరింపులు.. అసలేమైందంటే..?

Tollywood.. ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు ఎక్కువగా చంపేస్తామని బెదిరింపులు రావడం సాధారణంగా మారిపోయింది. చిన్నా చితకా విషయాలకి కూడా చంపేస్తామని బెదిరిస్తుండడంతో సెలబ్రిటీలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న ఎలక్షన్స్ సమయంలో యాంకర్ శ్యామల (Anchor Shyamala) తనను బెదిరిస్తున్నారని, ఫోన్ కాల్ ద్వారా చంపేస్తామని హెచ్చరిస్తున్నారంటూ వాపోయింది. మరొకవైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇప్పటికీ బిష్ణోయ్ కమ్యూనిటీ ద్వారా బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .
ఈ క్రమంలోనే ప్రముఖ నటి కూడా హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


బెదిరింపులు ఎదుర్కొంటున్న చాందిని భగ్వానానీ..

ప్రముఖ నటి చాందిని భగ్వానానీ (Chandini bhagwanani) కి హత్యా బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. సంజీవని (Sanjeevani )అనే ఒక టీవీ షోలో నెగిటివ్ క్యారెక్టర్ చేసినందుకు ఈమెపై ట్రోలింగ్ జరిగిందని ఆమె తెలిపింది. బాడీ షేవింగ్ చేయడంతో పాటు తనను చంపేస్తామని బెదిరింపులకు దిగారని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది.. ఆమె మాట్లాడుతూ నా క్యారెక్టర్ ను తక్కువ చేసి మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలు చేశారు.ముఖ్యంగా నా తల్లిదండ్రులకు మెసేజ్లు పంపేవారు.దానిని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లి పోతానేమోనని భయం వేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.


సెలబ్రిటీలే టార్గెట్..

నిజానికి ఒక పాత్ర అనేది క్యారెక్టర్ ని బట్టి డిసైడ్ చేస్తుంది. దర్శకుడు ఎలా చెబితే నటీనటులు అలా నటించాల్సి ఉంటుంది. కానీ అందులో నటించిన వారు నెగటివ్ గా నటిస్తే.. వారిని టార్గెట్ చేస్తూ హత్య చేస్తామని బెదిరించడం ముమ్మాటికి నేరం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇలాంటి ఎన్నో కామెంట్లు నేరుగా సెలబ్రిటీలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో తనికెళ్ల భరణి ఎంత పేరు దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ గా ఎన్నో సినిమాలలో ఆడవారిని హింసించే క్యారెక్టర్లలో ఆయన నటించారు. ఈ నేపథ్యంలోని ఆయన బయటకెళ్ళినప్పుడు చాలామంది మహిళలు ఆయనపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో సందర్భాలలో పాత్రల ద్వారా సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డ రోజులు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు చాందిని కూడా ఇలాగే ఇబ్బందులు పడుతుందని తెలిసి అభిమానులు కలవరపాటుకు గురి అవుతున్నారు.

చాందిని నటించిన తెలుగు చిత్రాలు..

ఇక చాందిని నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 2018లో చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించిన రథం అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 2019లో దిలీప్ కుమార్ సల్వాది దర్శకత్వంలో వచ్చిన దిక్సూచి అనే సినిమాలో కూడా నటించింది.. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఈమెకు గుర్తింపును అందివ్వలేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన ఈమె 2002లో కోహి అప్నా సా అనే టీవీ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో షోలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె, వెండితెరపై రాణించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇంకా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×