E-Paper
Advertisement

Tollywood: ముదురుతున్న లడ్డూ వివాదం.. సెలబ్రిటీలకు సంకటంగా మారిందా..?

Tollywood: ముదురుతున్న లడ్డూ వివాదం.. సెలబ్రిటీలకు సంకటంగా మారిందా..?
Advertisement

Tollywood..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఏకైక అంశం తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్వామి వారి లడ్డూ లో ఉపయోగించే స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు గొడ్డు మాంసం , పందికొవ్వు కలిపారు అనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే రాజకీయంగా మార్చడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి లడ్డూ నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే లడ్డూ నాణ్యత పరీక్షలు నిర్వహించిందా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సెలబ్రిటీలకు సంకటంగా మారిన లడ్డూ వివాదం..

Advertisement

అయితే మరోవైపు ఇంత సున్నితమైన అంశం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా హీరోలు లేదా హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎవరైనా సరే తమ సినిమాల కు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చారంటే చాలు మీడియా ప్రతినిధులు లడ్డూ వివాదం పై స్పందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ విషయంపై స్పందించి చిక్కుల్లో పడుతుంటే, మరికొంతమంది దీనిపై మాట్లాడకపోవడమే మంచిది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ లాంటి హీరోలు మాత్రం మాట్లాడడానికి సమయం కాదంటూ తప్పుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ లడ్డూ వివాదం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది.

ఇరుక్కుపోయిన కార్తీ..

Advertisement

అసలు విషయంలోకెళితే సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ లడ్డూ వివాదం పై స్పందించాలని కార్తీని కోరింది. అయితే కార్తీ లడ్డు సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇప్పుడు తానేమి మాట్లాడలేనని కూడా తెలిపారు. అయితే దీనిపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.ఇంత పెద్ద విషయాన్ని సిల్లీగా ఎలా తీసుకుంటారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో దిగివచ్చిన కార్తీ తప్పు చేయకపోయినా పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు.

మత కల్లోలాలు సృష్టించొద్దు అంటున్న ప్రకాష్ రాజ్..

దీనికి తోడు ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటుడు కూడా ఈ విషయంపై వరుస ట్వీట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు యాంటీగా మారుతున్న విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన హక్కు ఉంది. కానీ దీనిని రాజకీయం చేయవద్దు అని, ప్రసాదం పేరిట మతకల్లోలాలు సృష్టించవద్దు అంటూ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు ట్వీట్ చేశారు.

లడ్డూ వివాదం పై మాట్లాడడానికి నిరాకరించిన సూపర్ స్టార్..

అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఇదే విషయంపై ప్రశ్న ఎదురుగా.. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు అని సమాచారం. మీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త దయచేసి తిరుపతి లడ్డూ వివాదం పై మీ అభిప్రాయం చెప్పగలరు అంటూ ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉండిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10 న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ చేపట్టినట్లు తెలుస్తోంది . ఇందులో భాగంగానే లడ్డు విషయంపై స్పందించాలని కోరగా ఆయన కార్తీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంపై స్పందించలేదు అని సమాచారం. మొత్తానికైతే ఈ లడ్డు వివాదం అనేది నోరు విప్పితే ఒక గోల, విప్పకపోతే ఒక గోల అన్నట్టుగా సెలబ్రిటీలకు సంకటంగా మారింది. మరి ఈ విషయం ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×