E-Paper
Advertisement

Harom Hara Trailer: యుద్దం ఎవరితో అయినా సెయొచ్చు.. ఆయుధాలు చేసేవారితో కాదు.. యాక్షన్ సీన్లతో తుక్కు రేగ్గొట్టిన ట్రైలర్..

Harom Hara Trailer: యుద్దం ఎవరితో అయినా సెయొచ్చు.. ఆయుధాలు చేసేవారితో కాదు.. యాక్షన్ సీన్లతో తుక్కు రేగ్గొట్టిన ట్రైలర్..
Advertisement

ప్రస్తుతం అతడు నటిస్తున్న కొత్త సినిమా ‘హరోం హర’. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. అయితే సుధీర్ బాబు కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Advertisement

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే.. ‘బలవంతుడికి ఆయుధం అవసరమైతే.. బలహీనుడికి ఆయుధమే బలం’ అని వచ్చే స్టార్టింగ్ డైలాగ్ అందిరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కాసులు లేకుంటే కొంచెం కూడా లెక్కచేయరు. అలా డైలాగ్‌లు చూపించిన తీరు చూస్తుంటే.. మూవీలో హీరో ఎలాంటి పని లేకుండా.. సాదా సీదాగా ఊరి మీద తీరిగే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతడిని ఊరిలో వాళ్లంతా తిడుతుంటే.. ఇంట్లో ఉండే భార్య (మాళవికా శర్మ), అలాగే అతడి తండ్రి హీరోకి సపోర్ట్‌గా ఉంటుంటారు. మనకి మంచి రోజులు వస్తాయి అంటూ ఆ మంచి రోజులు కోసం ఎదురుచూస్తుంటారు.

Also Read: ‘హరోం హర’ నుంచి సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ‘కనులెందుకో’ పాట..!

Advertisement

అయితే ఓ రోజు హీరో గన్ కొనుక్కుంటాడు. దానికి చెల్లించిన డబ్బు తెలిసి ఆశ్యర్యపోతాడు. దీంతో తాను కూడా గన్‌లను తయారు చేయాలని చూస్తాడు. అలాగే గన్‌లను తయారుచేసే పనిలో పడి ఏకంగా గన్ స్మగ్లింగ్ చేసేంత స్థాయికి ఎదిగిపోతాడు. ఆ తర్వాత బడా బడా విలన్‌లకు కూడా వాటిని స్మంగ్లింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంటాడు. అలాంటి సమయంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇక ఆ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే నెల అంటే జూన్ 14న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×