BigTV English
Advertisement

Anushka shetty: క్యాస్టింగ్ కౌచ్ పై స్వీటీ కూడా స్పందించేసింది.. సమంతకు మద్దతుగా

Anushka shetty: క్యాస్టింగ్ కౌచ్ పై స్వీటీ కూడా స్పందించేసింది.. సమంతకు మద్దతుగా

Tollywood heroine Anushka shetty reaceated against Hema committee support with Samantha:
నాగార్జున, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఇండస్ట్రీలో అంతా ఆమెను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు. అరుంధతి మూవీ తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనివ్వడంతో హీరో పక్కన హీరోయిన్ా నటించే ఛాన్సులు తగ్గిపోయాయి. ఆ మధ్య ఓ సినిమాలో బొద్దుగా కనిపించాలని..పాత్ర కోసం బాగా లావుగా మారింది. ఇక ఆ తర్వాత అదే లావు కంటిన్యూ అవడంతో సినిమాలకు దూరం కావలసి వచ్చింది. మళ్లీ స్లిమ్ గా మారి గత ఏడాది మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి మూవీతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్లో దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించింది ఈ బ్యూటీ. అయినా సినిమాలలో నటించే విషయంలో ఆచితూచి అగుగేస్తోంది.


దెబ్బకొట్టిన సైజ్ జీరో

ప్రస్తుతం ఓ మలయాళ మూవీలో నటించేందుకు రెడీ అవుతోంది అనుష్క. తాను మలయాళ మూవీలో నటిస్తున్నట్లు..ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోలను కూడా రివీల్ చేసింది. బాహుబలి మూవీలో హీరో ప్రభాస్ కు సమాంతర పాత్ర దక్కినా తర్వాత అవకాశాలను ఎందుకో అందిపుచ్చుకోలేకపోయింది. సైజ్ జీరో మూవీ కోసం బాగా లావుగా మారిపోయింది. అదే అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టింది అనుష్కకు అని అభిమానులు అంటున్నారు. అప్పట్లో హీరో ప్రభాస్ తో పెళ్లి జరగబోతోందని వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. అవన్నీ గాసిప్స్ అని తేలింది. రీసెంట్ గా అనూష్క ఓ బిజినెస్ టైకూన్ ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొస్తున్నాయి. అయితే దీనిపైనా స్వీటీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


సమంతకు మద్దతుగా

రీసెంట్ గా మలయాళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. దానిపై నియమించిన హేమ కమిటీ నివేదికపై అన్ని పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీ హీరోయిన్లు స్పందిస్తున్నారు. చివరకు బుల్లితెర, రాజకీయ రంగం ఇలా దేనినీ వదలడం లేదు ఈ క్యాస్టింగ్ కౌచ్ జాడ్యం. ఇప్పుడు అన్ని పరిశ్రమలలోనూ హేమ కమిటీ లాంటిదే కావాలని ఆందోళన చేస్తున్నారు.
టాలీవుడ్ లోనూ ఈ తరహా కమిటీ వేయించాల్సిందిగా నటి సమంత రేవంత్ రెడ్డి సర్కార్ కు ఇటీవల వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే సెన్సేషనల్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లోనూ కమిటీ..

ఇప్పుడు టాలీవుడ్ లో సమంత పోస్టు సర్వత్రా చర్చేనీయాంశంగా మారింది. అయితే సమంతకు మద్దతుగా హీరోయిన్ అనుష్క శెట్టి కూడా తన గళం విప్పింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సంచనల పోస్ట్ పెట్టింది. ముందుగా హేమ కమిటీ కి ప్రత్యేక అభినందనలు. సపోర్టుగా కమిటీ ముందుకు వచ్చి ధైర్యంగా తమ సమస్యలు చెప్పుకుంటున్న నటులకు శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ హేమ కమిటీ తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు జరగాలని కోరుకుంటున్నాను. పనిచేసే చోట మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నానని..ఈ విషయంలో సమంతకు తన ఫుల్ సపోర్ట్ అంటూ పోస్టు పెట్టింది. మెల్లిగా సమంతకు టాలీవుడ్ లో మద్దతు పెరుగుతోంద.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×